Close

All schemes belonging to the Scheduled Castes should have grounding by the end of this month and notification of backlog posts should be issued immediately. Orders of the District Collector at the C.Sub Plan meeting

Publish Date : 26/03/2022

షెడ్యూల్డ్ కులాల వారికి చెందిన పథకాలన్నీ ఈ నెలాఖరులోగా గ్రౌండింగ్స్ కావాలి

బాక్లాగ్ పోస్టు ల నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలి

ఎస్. సి.సబ్ ప్లాన్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆదేసాలు

విజయనగరం, మార్చి 25:: షెడ్యూల్డ్ కులాల వారికి చెందిన పథకాలన్నీ ఈ నెలాఖరులోగా గ్రౌండింగ్స్ కావాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి అధికారులను ఆదేశించారు. జలకళ, ఏ. పి.ఎం. ఐ.పి, హౌసింగ్, జల జీవన్ మిషన్ ,టిడ్కో, ఐ.సి.డి.ఎస్ శాఖల ద్వారా ఎస్.సి కులాలకు చెందిన, ఇంతవరకు కవర్ కాని పథకాలన్నీ వెంటనే ప్రారంభం కావాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎస్.సి సబ్ ప్లాన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జాబ్ మేళాలో ఎస్.సి యువతకు తప్పనిసరిగా అవకాశాలు కల్పించాలని జి.ఎం డి.ఐ.సి కి, స్కిల్ డెవలప్మెంట్ శాఖలకు ఆదేశించారు. ఉపాధి కాల్పనా కార్యాలయం ద్వారా అన్ని డిగ్రీ, ఎం.బి.ఏ ,ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎస్.సి విద్యార్థులను నమోదు చేసుకోవాలన్నారు. రిజర్వేషన్ ప్రకారంగా వీరిని ఇంటర్వ్యూ లకు పంపాలన్నారు. అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న ఎస్.సి. ఎస్.టి బాక్ లాగ్ పోస్టు ల నియామకానికి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. అందుకు సంబంధించిన ఫైళ్లను సంబంధిత అధికారులే స్వయంగా వచ్చి అప్రూవల్ తీసుకోవాలన్నారు. ఇందులో ఎలాంటి జాప్యం జరిగినా సహించేది లేదన్నారు. ఎస్.సి., ఎస్.టి లకు కేటాయించిన నిధులను శత శాతం వారికే ఖర్చు చేయాలని, అవసరమైతే లబ్ధిదారులకు అవగాహన కలిగించి వినియోగించేలా చూడాలని అన్నారు.

ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఆసరా జె.వెంకట రావు, సోషల్ వెల్ఫేర్ డిడి సునీల్ రాజకుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

All schemes belonging to the Scheduled Castes should have grounding by the end of this month and notification of backlog posts should be issued immediately. Orders of the District Collector at the C.Sub Plan meeting