Close

As part of the Vijayanagara celebrations, the Mega Cultural Night organized on Monday evening at Ayodhya Maidan, was full of excitement. The program went on enthusiastically amid the enthusiasm of the youth

Publish Date : 14/10/2022

ఉర్రూతలూగించిన మెగా కల్చరల్ నైట్

విజయనగరం, అక్టోబర్ 10:
విజయనగరం ఉత్సవాల్లో భాగంగా, అయోధ్యా మైదానంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మెగా కల్చరల్ నైట్, ఆద్యంతము ఉర్రూతలూగించింది. యువత కేరింతల నడుమ ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ప్రముఖ విశ్వ నృత్య కళాకారిణి స్వాతి సోమనాధ్ ఆధ్వర్యంలో ఈ మెగా సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. నిశ్శబ్ద సంగీతం నృత్య రూపకం, ధర్మో రక్షిత రక్షితః, పైడితల్లి అమ్మవారి నృత్య రూపకాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఆనంద్ మిమిక్రి, హరితేజ యాంకరింగ్ ఆకట్టుకుంది. సినీ సంగీత విభావరి అలరించింది.
గాయకులు, గాయనీమణులు సురభి శ్రావణి, కల్పన, హరిప్రియ, హారిక, ధనుంజయ్, నిహార్ తదితరుల గాన మాధుర్యం మంత్ర ముగ్దలను చేసింది.
ఈ కార్యక్రమాలను రాష్ట్ర విద్యా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పి ఛైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, ఎమ్మెల్సీలు డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, ఇందుకూరి రఘురాజు, పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు సంబంగి వెంకట చినప్పల నాయుడు, కంబాల జోగులు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, వేలాది మంది ప్రేక్షకులు తిలకించారు. వయోజన విద్య డిడి కోట్ల సుగుణాకరరావు, డిఆర్డీఏ పిడి ఏ. కల్యాణ చక్రవర్తి, సీపీవో పి.బాలాజీ ఈ ఉత్సవ వేదికకు ఇన్ఛార్జ్లుగా వ్యవహరించారు.

As part of the Vijayanagara celebrations, the Mega Cultural Night organized on Monday evening at Ayodhya Maidan, was full of excitement. The program went on enthusiastically amid the enthusiasm of the youth