Close

Awareness should be created before construction of houses, cluster mapping should be completed immediately, houses should be prepared by November 25, District Collector A. Surya Kumari

Publish Date : 28/10/2021

ఇళ్ళ నిర్మాణానికి ముందుకు  వచ్చేలా అవగాహన కలిగించాలి

క్లస్టర్  మాపింగ్ వెంటనే పూర్తి చేయాలి

నవంబర్ 25 నాటికే టిడ్కో ఇళ్ళను సిద్ధం చేయాలి

                                                               జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి

విజయనగరం, అక్టోబర్ 28:   నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం క్రింద మంజూరైన లబ్ది దారులు గృహ నిర్మాణాలకు ముందుకు  రాని వారికి అవగాహన కలిగించాలని   జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి మున్సిపల్ కమీషనర్లను, గృహ నిర్మాణ అధికారులను ఆదేశించారు.   ఎక్కడ ఇళ్ళు కడితే అక్కడికి వెళ్ళేలా ముందుగా లబ్ది దారులను చైతన్య పరచాలని, గృహ నిర్మాణాల వలన ఒనగూరే  లాభాలను  వివరించి ఒప్పించ్చాలని, అప్పటికి ఆసక్తి లేని వారి పట్టాలను రద్దు చేసి ఆసక్తి ఉన్న అర్హులైన వారికి ఇవ్వాలని సూచించారు.  ఇష్టం ఉన్న వారితో ముందు నిర్మాణాలు చేపడితే, మిగిలిన వారిలో చైతన్యం కలిగి  వారు కూడా ముందుకు వస్తారని అన్నారు. జగనన్న కాలనీ లు, వన్ టైం సెటిల్ మెంట్, టిడ్కో గృహాల పురోగతి పై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జే.సి అశోక్ మయూర్ తో కలసి  కలెక్టర్ సమీక్షించారు. .  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న కాలనీ లలో రహదారులు,  విద్యుత్,  నీటి సరఫరా,  బోర్ వెల్స్ తదితర మౌలిక వసతులను త్వరగా కల్పించాలని, అన్ని వసతులు ఉంటే ప్రజలకు ఆసక్తి కలుగుతుందని  అన్నారు.   వచ్చే శుక్రవారాని కల్లా  జియో   ట్యాగింగ్ , క్లస్టర్ మాపింగ్ , రిజిస్ట్రేషన్ లు పూర్తి కావాలని సూచించారు.  క్షేత్ర స్థాయి  తనిఖీలు నిర్వహించి తలెత్తే సమస్యల పై ముందుగా దృష్టి  పెట్టాలన్నారు.  డబల్ ఎంట్రీ లు, డేటా బేస్ , నాట్ విల్లింగ్ తదితర రిమార్క్ లను రాసి ముందుగా అప్ లోడ్ పూర్తి చేయాలన్నారు.  సాలూరు మున్సిపాలిటీ లో  ఇళ్ళ నిర్మాణాలు తక్కువగా ప్రారంభం అయినందున  కమీషనర్ పై  ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక పై ప్రతి వారం సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించడం జరుగుతుందని, పురోగతి కనపడక పోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.  క్షేత్ర స్థాయి పరిసేలన లో  రెవిన్యూ, ఇంజినీరింగ్, వాలంటీర్, వి.ఆర్.ఓ ల మధ్య సమన్వయం  ఉండాలని అందరూ కలిసి పని చేస్తే  తదుపరి సమస్యలు తలెత్తవని అన్నారు.  బ్యాంకర్లతో  ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి బ్యాంకు  రుణాలు త్వరగా వచ్చేలా చూడాలన్నారు.  ఓ.టి.ఎస్ పధకం పై దృష్టి పెట్టి లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.

డిసెంబర్ లో టిడ్కో గృహాల అందజేత :

          ఈ డిసెంబర్ నెలలో  టిడ్కో గృహాలను లబ్దిదారులకు అందజేయాలని  ప్రభుత్వం భావిస్తున్నందున నవంబర్ 25 నాటికే గృహాలను సిద్ధంగా ఉంచాలని  ఆదేశించారు. మొదటి దశలో అందజేసే గృహాలకు సంబంధించిన గృహాల వద్ద అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు.  జల శక్తి  అభియాన్  క్రింద  వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ను కూడా నిర్మించాలని అన్నారు.   అన్ని వసతులతో పాటు నివాస యోగ్యంగా ఉండేలా, సుందరంగా తీర్చి దిద్దాలని ఆదేశించారు.

          ఈ సమావేశం లో హౌసింగ్ పి.డి పి.కూర్మి నాయుడు, కార్పొరేషన్  కమీషనర్ వర్మ, బొబ్బిలి, సాలూరు, పార్వతీపుర, నెల్లిమర్ల మున్సిపల్ కమీషనర్లు , హౌసింగ్  ఈ.ఈ , డి.ఈ లు పాల్గొన్నారు.

Awareness should be created before construction of houses, cluster mapping should be completed immediately, houses should be prepared by November 25, District Collector A. Surya Kumari