Close

Beneficiaries should come forward for full cooperation for construction of houses. District Collector A. Suryakumari

Publish Date : 09/02/2022

ఇళ్ల‌ నిర్మాణానికి  సంపూర్ణ స‌హ‌కారం
ల‌బ్ద‌దారులు ముందుకు రావాలి
జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి
గుంక‌లాం లేఅవుట్ ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్‌
ఒంప‌ల్లి స‌చివాల‌యం త‌నిఖీ

విజ‌య‌న‌గ‌రంఫిబ్ర‌వ‌రి 08 ః
జ‌గ‌న‌న్న కాల‌నీల్లోని ఇళ్ల నిర్మాణానికి ప్ర‌భుత్వ‌ప‌రంగా సంపూర్ణ స‌హాకారాన్ని అందిస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి అన్నారు. ల‌బ్దిదారులంతా ముందుకు వ‌చ్చిఇంటి నిర్మాణాన్ని త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని కోరారు. విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణ పేద‌ల‌కోసం గుంక‌లాం వ‌ద్ద రూపొందించిన భారీ లేఅవుట్‌ను మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. అక్క‌డ ఇళ్ల నిర్మాణాల ప‌రిస్థితిపై అధికారుల‌తో స‌మీక్షించారు. అవ‌గాహ‌నా స‌ద‌స్సుకు హాజ‌రైన గృహ‌నిర్మాణ‌ ల‌బ్దిదారుల‌తో మాట్లాడివారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. వాటిని ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు.
ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూఅర్హులైన  పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాల‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. దీనిలో భాగంగా ఇప్ప‌టికే మంజూరైన‌ ఇళ్ల‌ను ల‌బ్దిదారులు త్వ‌ర‌గా ప్రారంభించాల‌ని సూచించారు. ఇంటి నిర్మాణానికి కావాల్సిన మౌలిక స‌దుపాయాల‌న్నిటినీ ప్ర‌భుత్వప‌రంగా క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. సిమ్మెంటుఇసుక‌ఐర‌న్ ఇస్తున్నామన్నారు. లేఅవుట్ల‌లో నిర్మాణం కోసం నీటి స‌దుపాయం కూడా క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న‌ ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగాం చేసుకొనిల‌బ్దిదారులంతా త్వ‌ర‌గా త‌మ‌ ఇళ్ల‌ను పూర్తిచేయాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (హౌసింగ్‌) మ‌యూర్ అశోక్‌మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌స్పెష‌ల్ డిప్యుటీ క‌లెక్ట‌ర్ సూర్య‌నారాయ‌ణ‌హౌసింగ్ పిడి కూర్మినాయుడుఇఇ ఎన్‌వి ర‌మ‌ణ‌మూర్తిడిఇ  సిహెచ్ శ్రీ‌నివాస‌రావుఏఇలు పాల్గొన్నారు.

ఒంప‌ల్లి స‌చివాల‌యం త‌నిఖీ
బొండ‌ప‌ల్లి మండ‌లం ఒంప‌ల్లి గ్రామ స‌చివాల‌యాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా సిబ్బంది బ‌యోమెట్రిక్ హాజ‌రురికార్డుల‌ను ప‌రిశీలించారు. వేక్సినేష‌న్‌ఓటిఎస్‌గృహ‌నిర్మాణంపోష‌కాహార పంపిణీఇంటింటి చెత్త సేక‌ర‌ణ‌ఉపాదిహామీ ప‌నులు త‌దిత‌ర కార్య‌క్ర‌మాల అమ‌లుపై సిబ్బందిని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల అమ‌లుతీరుమ‌హిళ‌లుగ‌ర్భిణుల ఆరోగ్య ప‌రిస్థితిబాలిక‌ల చ‌దువుగ‌ర్భ‌స్థ లింగ నిర్ధార‌ణ‌వైద్య స‌దుపాయాలు త‌దిత‌ర అంశాల‌పై గ్రామ స‌ర్పంచ్ లండ నారాయ‌ణ‌మ్మ‌ను ఆరా తీశారు.  ఓటిఎస్ కార్య‌క్ర‌మం పేద‌ల‌కు ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న గొప్ప అవ‌కాశ‌మ‌నికేవ‌లం రూ.10వేలు చెల్లించి ల‌క్ష‌ల విలువైన ఆస్తిపై సంపూర్ణ హ‌క్కును పొంద‌వ‌చ్చ‌ని సూచించారు. ఈ ప‌థ‌కాన్ని ప్ర‌తీఒక్క‌రూ వినియోగించుకొనేలా చూడాల‌ని కోరారు. గ్రామానికి మంజూరైన 45 ఇళ్ల నిర్మాణాన్ని త్వ‌ర‌గా పూర్తి చేయించాల‌ని సూచించారు. గ్రామంలో పారిశుధ్యం మెరుగుప‌డాలంటేప్ర‌తి ఇంటినుంచి చెత్త సేక‌ర‌ణ జ‌ర‌గాల‌నివ్య‌క్తిగ‌త‌సామూహిక మ‌రుగుదొడ్ల‌ను వాడేవిధంగా చూడాల‌న్నారు. ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్ర‌తీఒక్క‌రూ వినియోగించుకొనేలా వారిని చైత‌న్య ప‌ర‌చాల‌ని క‌లెక్ట‌ర్‌ సూచించారు.

Beneficiaries should come forward for full cooperation for construction of houses. District Collector A. Suryakumari