News
District Collector Surya Kumari suggested that the first priority should be given to the construction of Farmer Assurance Centers, YSR Farmer Assurance Centers and Secretariat buildings in the work being carried out with employment guarantee funds.
Published on: 08/06/2022ఉపాధి హామీ లో భవన నిర్మాణాలకు ప్రాధాన్యత నివ్వాలి జామి మండలం జాగారం, చింతాడ సచివాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్ విజయనగరం, జూన్ 07:: ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న పనుల్లో రైతు భరోసా కేంద్రాలు , వై.ఎస్.ఆర్ రైతు భరోసా కేంద్రాలను, సచివాలయాల భవనాల నిర్మాణాలకు తొలి ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలెక్టరు సూర్య కుమారి సూచించారు. మంగళవారం జామి మండలం జాగారం, చింతాడ సచి వాలయాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అందరి ఫంక్షనల్ అసిస్టెంట్ల […]
Machine tools should be made available to all farmers, the Farmer Welfare Government said, adding that the CM, YSR ZP Chairman Majji Srinivasa Rao distributes machinery and equipment
Published on: 08/06/2022రైతులందరికీ యంత్ర పరికరాలు ఉపయోగపడాలి రైతు సంక్షేమ ప్రభుత్వం ఇది పండగ కన్నా మిన్నగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దిన సి.ఎం. వై.ఎస్.ఆర్. యంత్రసేవ పరికరాల పంపిణీలో జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం, జూన్ 07 : వై.ఎస్.ఆర్. యంత్రసేవ పథకం ద్వారా ప్రభుత్వం రైతు గ్రూపులకు అందజేస్తున్న వ్యవసాయ యంత్ర పరికరాలు ఆయా గ్రామాల్లోని రైతులందరికీ ఉపయోగపడాలని జిల్లాపరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీతో మంజూరు చేస్తున్న ఈ ట్రాక్టర్లు ఇతర పరికరాలు రైతులు తమ సొంతానివిగా […]
Strive to achieve the goal, District Collector Ms.Suryakumari,IAS Collector who congratulated Tenth Toppers
Published on: 08/06/2022లక్ష్యసాధనకు కృషి చేయండి జిల్లా కలెక్టర్ సూర్యకుమారి పిలుపు టెన్త్ టాపర్స్‌ను అభినందించిన కలెక్టర్ విజయనగరం, జూన్ 07 ః ప్రతీ విద్యార్థీ తన జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకొని, దానిని సాధించేందుకు కృషి చేయాలని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. మరో ఐదారేళ్లపాటు బాగా కష్టపడి చదివితే, మంచి స్థానంలో స్ధిరపడవచ్చని సూచించారు. కష్టపడి, ప్రణాళికాబద్దంగా కృషి చేస్తే, ఏదైనా సాధించవచ్చని స్పష్టం చేశారు. పదోతరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులను సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తన ఛాంబర్‌లో మంగళవారం […]
District New Record Welfare Schools in Paradigm Success Public Institutions Powered by Super Success in KGBV
Published on: 08/06/2022పదోతరగతిలో జిల్లా కొత్త రికార్డు సంక్షేమ పాఠశాలల విజయబావుటా కెజిబివిల్లో సూపర్ సక్సెస్ సత్తా చాటిన ప్రభుత్వ విద్యాసంస్థలు విజయనగరం, జూన్ 06 ః పదోతరగతి పరీక్షల్లో విజయనగరం జిల్లా విద్యార్థులు చరిత్ర సృష్టించారు. దాదాపు 62 శాతం మంది ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణులై రికార్డు తిరగరాశారు. ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ సత్తా చాటారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల విద్యార్థులు అద్వితీయ విజయాలను […]
District Collector Surya Kumari, who congratulated the officers, was ranked third in the district in ten examinations
Published on: 07/06/2022పది పరీక్షల్లో జిల్లాకు మూడో రాంక్ అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, జూన్ 06:: పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లా మెరుగైన రాంకు ను సాధించింది. రాష్ట్రం లో 13 ఉమ్మడి జిల్లాలకు గాను 77.50 శాతం ఉత్తీర్ణత తో విజయనగరం జిల్లాకు 3వ రాంక్ వచ్చింది. మొదటి రాంక్ ప్రకాశం జిల్లా 78.30 సాధించగా 78.22 శాతం తో శ్రీకాకుళం జిల్లా రెండవ స్థానం సాధించింది. విజయనగరం జిల్లా నుండి 29,365 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 14,900 మంది బాలురు , 14,465 మంది బాలికలు ఉన్నారు. అయితే బాలికలు బాలుర […]
212 tractors distributed today as part of Megamela, YSR Machinery Service in Vijayanagar
Published on: 07/06/2022నేడు విజయనగరంలో మెగామేళా వైఎస్ఆర్ యంత్రసేవ లో భాగంగా 212 ట్రాక్టర్లు పంపిణీ విజయనగరం, జూన్ 06 ః వైఎస్ఆర్ యంత్రసేవ కార్యక్రమంలో భాగంగా, మంగళవారం విజయనగరం ఆనందగజపతి ఆడిటోరియంలో మెగా మేళా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 212 రైతు సంఘాలకు 212 ట్రాక్టర్లను, మరో 29 సంఘాలకు వివిధ వ్యవసాయ యంత్ర పరికరాలను, ఇలా మొత్తం సుమారు రూ.18.27 కోట్ల విలువైన పరికరాలను, రూ.5.96కోట్లు రాయితీతో అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే గత ఏడాది 211 సంఘాలకు, రూ.11.59కోట్ల విలువైన యంత్రపరికరాలను, రూ.3.85కోట్ల రాయితీతో అందజేయడం జరిగిందని తెలిపారు. మెగామేళా కార్యక్రమాన్ని లైవ్ […]
Focus on Kharif, the names of the cultivators in this crop should be registered and the complaints received should be resolved in a timely manner, District Collector A. Suryakumari
Published on: 07/06/2022ఖరీఫ్‌పై దృష్టి పెట్టండి ఈ క్రాప్‌లో సాగుచేసినవారి పేరు నమోదు చేయాలి స్పందన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, జూన్ 06 ః వర్షాలు ప్రారంభమైనందువల్ల, ఖరీఫ్ పంటల సాగుపై దృష్టి పెట్టాలని, అధికారులకు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేసేటప్పుడు, రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేయాలని సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో, అధికారులకు కలెక్టర్ పలు ఆదేశాలను జారీ చేశారు. ఖరీఫ్ సీజన్ మొదలుకాబోతోందని, రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో సక్రమంగా అందేటట్టుగా […]
District Collector Smt. A. Suryakumari handed over the laptop to Divyangudu Jamie Ganesh at the Collectorate Auditorium on Monday.
Published on: 07/06/2022జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమశాఖ ద్వారా, దివ్యాంగుడు జామి గణేష్‌కు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ల్యాప్‌టాప్ ను అందజేశారు. జిల్లాకు చెందిన గణేష్, నూజివీడు ఐఐఐటిలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. తన విద్యాభ్యాసన కోసం, ల్యాప్‌టాప్ కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, సుమారు రూ.40వేలు విలువైన ల్యాప్‌టాప్, బ్యాగును అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖాధికారి డి.కీర్తి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
District Collector A. Suryakumari on the occasion of World Environment Day and awareness rallies in many places.
Published on: 06/06/2022ప్రకృతి వనరులను పరిరక్షించాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం పలుచోట్ల అవగాహనా ర్యాలీలు విజయనగరం, నెల్లిమర్ల, జూన్ 05 ః ప్రకృతి వనరులను భావితరాల కోసం పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి అన్నారు. ఆ దిశగా ప్రతీఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. […]
Renovation of R&B roads in the district, repair work of roads today – Rs. 140 crore sanctioned today, District Collector Surya Kumari
Published on: 06/06/2022జిల్లాలో ఆర్ అండ్ బి రోడ్లకు కొత్తరూపు రోడ్ల మరమ్మత్తు పనులు నాడు- నేడు రూ.140 కోట్ల నిధులు మంజూరు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, జూన్,04: జిల్లాలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రోడ్ల మరమ్మత్తులు ముమ్మరంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇదివరకెన్నడూ లేనంతగా ఒకే ఏడాది రూ.140 కోట్ల నిధులు జిల్లాలో రోడ్ల మరమ్మత్తులకు మంజూరయ్యాయని, ఈ నిధులతో 66 రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను 600 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. న్యూ డెవలప్ […]