Close

Collector A. Suryakumari directed the staff of the Secretariat to explain the taluka benefits of the OTS (One Time Settlement) scheme to the beneficiaries.

Publish Date : 25/11/2021

*ఓటీఎస్ ప్ర‌యోజ‌నాల‌ను ల‌బ్ధిదారుల‌కు వివ‌రించండి*
* అయ్య‌న్న‌పేట స‌చివాల‌య సంద‌ర్శ‌న‌లో క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి

విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌ర్ 25 ః రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఓటీఎస్ (ఒన్ టైం సెటిల్మెంట్‌) ప‌థ‌కం తాలూక ప్ర‌యోజ‌నాల‌ను ల‌బ్ధిదారుల‌కు వివ‌రించాల‌ని క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి స‌చివాయ సిబ్బందిని ఆదేశించారు. ల‌బ్ధిదారుల‌తో ఓపిగ్గా మాట్లాడి ఒప్పించాల‌ని సూచించారు. గురువారం ఆమె కొత్త‌మ‌జ్జిపేట‌లో ఉన్న అయ్య‌న్న‌పేట (43) స‌చివాల‌యాన్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. స‌చివాల‌యం ద్వారా అందుతున్న వివిధ సేవ‌ల‌పై సిబ్బందిని ఆరా తీశారు. ఓటీఎస్ ప్ర‌క్రియ‌, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌, స్పంద‌న విన‌తుల ప‌రిష్కారం, పింఛ‌న్ల పంపిణీ తదిత‌ర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. వివ‌రాలు స‌రిగా చెప్ప‌లేక‌పోయిన‌ కొంత‌మంది సిబ్బందిపై క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఓటీఎస్‌, వ్యాక్సిన్‌, పింఛ‌న్ల పంపిణీ, ఓటు న‌మోదు ప్ర‌క్రియ త‌దిత‌ర అంశాల‌పై ఒక్కొక్క‌ వాలంటీర్‌తో క‌లెక్ట‌ర్ మాట్లాడారు. ఓటీఎస్‌, వ్యాక్సినేష‌న్‌లో మ‌రింత పురోగ‌తి సాధించాల‌ని ఈ సంద‌ర్భంగా సూచించారు. అనంత‌రం ప్ర‌గ‌తి నివేదిక‌ల‌ను, హాజ‌రు ప‌ట్టీల‌ను ప‌రిశీలించారు. స‌చివాల‌య ఉద్యోగులు, వాలంటీర్లు త‌దిత‌రులు ఉన్నారు.

Collector A. Suryakumari directed the staff of the Secretariat to explain the taluka benefits of the OTS (One Time Settlement) scheme to the beneficiaries.