Collector Ramzan wishes to Muslim Brothers * * Wishing everyone a happy and prosperous life

Publish Date : 04/05/2022
Collector Ramzan wishes to Muslim Brothers * * Wishing everyone a happy and prosperous life
*ముస్లిం సోద‌రుల‌కు క‌లెక్ట‌ర్‌ రంజాన్ శుభాకాంక్ష‌లు*
*అంద‌రూ సుఖ‌, సంతోషాల‌తో జీవించాల‌ని ఆకాంక్ష‌
విజ‌య‌న‌గ‌రం, మే 02 ః ఎంతో నిష్ఠ‌తో… భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ముస్లిం సోద‌రులు జ‌రుపుకొనే పవిత్ర పండుగ‌ రంజాన్ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి శుభాకాంక్ష‌లు తెలిపారు. అల్లా దీవెనలతో జిల్లా ప్ర‌జ‌ల‌కు సుఖ‌, సంతోషాలు, స‌క‌ల శుభాలు క‌ల‌గాల‌ని, ఆయురారోగ్యాల‌తో జీవించాల‌ని ఆకాంక్షించారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, దాతృత్వం, ధార్మిక చింత‌న‌ల క‌ల‌యికే రంజాన్ మాసం విశిష్ట‌త అని ఆమె పేర్కొన్నారు. నెల రోజుల పాటు క‌ఠోర దీక్ష‌తో నిష్ఠ‌గా అల్లాను ఆరాధిస్తూ అత్యంత క్ర‌మ శిక్ష‌ణ‌తో కూడిన‌ ఆధ్యాత్మిక జీవనం కొన‌సాగిస్తార‌ని గుర్తు చేశారు. అల్లా కరుణ‌, ద‌య‌, కృప‌తో ముస్లిం సోద‌ర, సోద‌రీమ‌ణులు ర‌క్ష‌ణ పొందాల‌ని, కుటుంబ స‌భ్యుల‌తో పాటు ఆనందాల న‌డుమ రంజాన్ ప‌ర్వదినాన్ని సంతోషంగా జ‌రుపుకోవాల‌ని ఆమె ఆకాంక్షించారు. మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌గా నిలిచే ఈ పండుగ వేళ అంద‌రూ సోద‌ర‌భావంతో మెల‌గాల‌ని ఆమె ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు ముస్లిం సోద‌రులకు శుభాకాంక్ష‌లు తెలుపుతూ సోమ‌వారం ఆమె ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.