Collector visited the secretariats of L.Kota and S.Kota mandals
Publish Date : 02/11/2021
ఎల్.కోట, ఎస్.కోట మండలాల్లో సచివాలయాలను సందర్శించిన కలెక్టర్
విజయనగరం, నవంబర్ 02:: జిల్లా కలెక్టర్ ఏ.సూర్య కుమారి మంగళవారం ఎల్.కోట, ఎస్.కోట మండలాల్లో పర్యటించారు. ఎల్.కోట మండలం తామరాపల్లి గ్రామ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల తో సంక్షేమ పథకాల పై చర్చించి పలు సూచనలు జారీ చేశారు. పింఛన్ల పంపిణీ, వాక్సినేషన్ , సంపూర్ణ గృహ హక్కు పధకం తదితర అంశాల పై సమీక్షించారు. అనంతరం రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎరువుల పరిస్థితి, ఈ పంట నమోదు, ఈకేవైసి తదితర అంశాలపై ఆరా తీశారు. ఎస్.కోట మండలం బొడ్డవర లో సచివాలయాన్ని తనిఖీ చేశారు. వాక్సినేషన్ కోసం ఎంత మందిని గుర్తించారు, ఇంకా ఎంత మందికి వేయాల్సి ఉందని ప్రశ్నించారు. వాక్సినేషన్ డేటా ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేయాలన్నారు. ఈ సేవ దరఖాస్తులను గడువు కంటే ముందే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం రికార్డ్ లను, హాజరు ను తనిఖీ చేశారు. ఈ పర్యటన లో రెండు మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.
