Collector who inspected the Secretariat
Publish Date : 18/10/2021
సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
డెంకాడ (విజయనగరం), అక్టోబరు 12 ః డెంకాడ మండలం మోపాడ గ్రామ వార్డు సచివాలయాన్ని, రైతు బరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్, మూవ్‌మెంట్ రిజిష్టర్లను ఆమె పరిశీలించారు. ఇతర రికార్డులను తనిఖీ చేశారు. స్పందన వినతులుపై ఆరా తీశారు. సచివాలయ పరిధిలో వివిధ పథకాల అమలును తెలుసుకున్నారు. వేక్సినేషన్ ప్రక్రియను శతశాతం పూర్తి చేయాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. రైతు బరోసా కేంద్రాన్ని సందర్శించి ఎరువులపై, ఈక్రాప్ నమోదు,రైతు సంక్షేమ పధకాలపై ఆరా తీసారు.