Collector’s extensive tour, Secretariat, KGBV inspection at Badangi
Publish Date : 23/07/2022
బాడంగిలో కలెక్టర్ విస్తృత పర్యటన
సచివాలయం, కెజిబివి తనిఖీ
బాడంగి, (విజయనగరం), జులై 22 ః బాడంగి మండలంలో జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి శుక్రవారం విస్తృతంగా పర్యటించారు., మండలంలోని భీమవరం గ్రామ సచివాలయాన్నిఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్, ఇతర రికార్డులను పరిశీలించారు. స్పందన్ గ్రీవెన్స్‌లో ఆరా తీశారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ప్రశ్నించారు. ముఖ్యంగా గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు ఇస్తున్న వ్యాధి నిరోధక టీకా కార్యక్రమంపై ఆరా తీశారు. సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. పోషకాహార పంపిణీతీరును, గర్భిణీలతో మాట్లాడి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు హాజరై భోజనం తీసుకొనేలా గర్భిణులను, బాలింతలను చైతన్య పరచాలని సూచించారు. రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
మండల కేంద్రంలోని కెజిబివి పాఠశాలను కలెక్టర్ సూర్యకుమారి సందర్శించారు. పాఠశాల పరిసరాలను, కిచెన్ షెడ్‌ను పరిశీలించారు. ఖాళీ స్థలంలో కూరగాయలు, కరివేపాకు తదితర ఆకుకూరల సాగు చేపట్టాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడారు. వారి పఠనా సామర్ధ్యాన్ని పరీక్షించారు. అనంతరం తాశీల్దార్ కార్యాలయంలో, భూముల రీసర్వేపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ పర్యటనలో బొబ్బిలి ఆర్డిఓ శేషశైలజ, తాశీల్దార్ ఆర్.బాల మురళీకృష్ణ, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
