Committee meeting on sexual harassment of women employees on 27th, District Collector Smt. Suryakumari
Publish Date : 29/12/2021
మహిళా ఉద్యోగుల లైంగిక వేధింపులపై 27న కమిటీ సమావేశం
ఈలోగా ఆధారాలతో బాధితులు ఫిర్యాదులు అందజేయాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి
విజయనగరం, డిసెంబరు 24; మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు సంబంధించి జిల్లా స్థాయిలో ఏర్పాటైన అంతర్గత కమిటీ సమావేశం డిసెంబరు 27న మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్, నోటిఫికేషన్ అధికారి శ్రీమతి ఏ.సూర్యకుమారి తెలిపారు. మహిళా ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపులకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను ఈ సమావేశంలో చర్చించి పరిష్కరించడం జరుగుతుందన్నారు.
బాధితులైన మహిళా ఉద్యోగులు తమ ఫిర్యాదులను ఆధారాలతో సహా ఈనెల 27న సమావేశం జరిగే లోగా 9440814584 మొబైల్ నెంబరులో వాట్సప్ ద్వారా లేదా ఉమెన్ హెల్ప్‌లైన్ నెంబరు 181లో ఫిర్యాదులు మహిళా శిశు సంక్షేమశాఖకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం మొదటి అంతస్థులోని జిల్లా మహిళాశిశు సంక్షేమశాఖ కార్యాలయానికి నేరుగా ఫిర్యాదులు కూడా అందజేయవచ్చని, లేదా ఆ కార్యాలయ ఇ-మెయిల్ pddwcdavzm2@gmail.com కు గాని ఫిర్యాదులు అందజేయవచ్చన్నారు. ఫిర్యాదుదారులు ఈనెల 27న కమిటీ ముందుకు తగిన ఆధారాలతో హాజరు కావలసి వుంటుందన్నారు. ఫిర్యాదు దారులు అందజేసిన సమాచారాన్ని గోప్యంగా వుంచడం జరుగుతుందన్నారు.