Close

Construction of houses should be started immediately, the services of the secretariats should be made more accessible to the people, Joint Collector Mayur Ashok, MDU, Secretariat inspection

Publish Date : 11/04/2022

ఇళ్ల నిర్మాణాన్ని వెంట‌నే ప్రారంభించాలి,
స‌చివాల‌యాల సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేయాలి, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌
ఎండియు, స‌చివాల‌యం త‌నిఖీ

గంట్యాడ (విజ‌య‌న‌గ‌రం), ఏప్రెల్ 08 ః
మంజూరైన ప్ర‌తీ ఇంటి నిర్మాణాన్ని వెంట‌నే ప్రారంభించాల‌ని, స‌చివాల‌య సిబ్బందిని జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ ఆదేశించారు. ఆయ‌న శుక్ర‌వారం గంట్యాడ మండ‌లంలో ప‌ర్య‌టించారు. కొటారుబిల్లి గ్రామ స‌చివాల‌యాన్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా సిబ్బంది హాజ‌రును ప‌రిశీలించారు. కొంత‌మంది వ‌లంటీర్ల హాజ‌రు త‌క్కువ‌గా ఉండ‌టంపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ప్ర‌తీ వ‌లంటీరు ఖ‌చ్చితంగా వారానికి మూడు రోజుల‌పాటు స‌చివాల‌యానికి హాజ‌రు కావాల‌ని ఆదేశించారు. జ‌గ‌న‌న్న కాల‌నీలు, గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మంపై స‌మీక్షించారు. ఇళ్లు మంజూరైన ప్ర‌తీఒక్క‌రిచేతా నిర్మాణాన్ని ప్రారంభింప‌జేయాల‌ని ఆదేశించారు. పెన్ష‌న్ల పంపిణీపైనా, జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన‌, ఓటిఎస్‌పైనా ప్ర‌శ్నించారు. స‌చివాల‌యాల సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేయాల‌ని కోరారు. దీనికోసం స‌చివాల‌యాల్లో ప్ర‌స్తుతం అందిస్తున్న ముఖ్య‌మైన‌ సేవ‌ల గురించి ఫ్లెక్సీలు వేసి, ప్ర‌చారం చేయాల‌ని సూచించారు. రైతుభ‌రోసా కేంద్రం ద్వారా అందిస్తున్న సేవ‌ల‌పై ప్ర‌శ్నించారు.
గ్రామంలో రేష‌న్ పంపిణీ చేస్తున్న ఎండియు యూనిట్‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. దాని ద్వారా అందిస్తున్న స‌రుకులు, జిల్లాలోని ఇత‌ర ఎండియు వాహ‌నాల గురించి ఆరా తీశారు. అన్ని ఎండియు యూనిట్ల ద్వారా స‌ర‌కుల పంపిణీ జ‌ర‌గాల‌ని, దానికి త‌గిన‌విధంగా వాహనాల‌ను ఎల్ల‌ప్పుడూ సిద్దంగా ఉంచాల‌ని సూచించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో జిల్లా స‌ర‌ఫ‌రా అధికారి ఎం.పాపారావు, ఇన్‌ఛార్జి తాశీల్దార్ స్వ‌ర్ణ‌కుమార్‌, ఎంపిడిఓ నిర్మ‌లాదేవి, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Construction of houses should be started immediately, the services of the secretariats should be made more accessible to the people, Joint Collector Mayur Ashok, MDU, Secretariat inspection