Deadline extended till 17th for farmers to do e-KYC* : Joint Collector
Publish Date : 17/10/2022
*రైతులు ఇ – కెవైసి చేయించు కొనేందుకు 17వరకు గడువు పెంపు* : జాయింట్ కలెక్టర్
జిల్లాలో ఇప్పటివరకు ఖరీఫ్ 2022 లో 3,79,001 ఎకరాలలో వివిధ పంటల సాగు జరుగుతున్నది. దీనిలో ప్రధానముగా వరి పంట 2,31,967 ఎకరములలో, మొక్కజొన్న 26,248 ఎకరములలోమరియు ప్రత్తి పంట 4,594 ఎకరములలో సాగు జరుగుచున్నది. ఈ మూడు పంటలకు ఖరీఫ్ పంటకాలంలో వై యస్ ఆర్ ఉచిత పంటల భీమా పధకం వర్తిస్తుంది. ప్రస్తుతము 100 శాతం ఈ పంట నమోదు పూర్తి అయ్యింది. రైతు యొక్క ఈ కే వై సి(E Kyc) వరి పంట 2,00,657 ఎకరములలో(87%), మొక్కజొన్న 20,312 ఎకరములలో(77%) మరియు ప్రత్తి పంట 3,781 ఎకరములలో (83%) శాతం పూర్తి అయింది. ఆలాగే ఇప్పటివరకు వి.ఏ.ఏ లు నూరు శాతం మరియు వి.ఆర్.ఓ లు కలిపి 100% e-క్రాప్ ను ధృవీకరించటం జరిగినది. రైతు సోదరులు పంటల భీమా, పంటకొనుగొలు, పంట నష్ట పరిహారం, బ్యాంకు ఋణాలు మొదలగు పధకాలకు అర్హత పొందాలంటే e –KYC (బయోమెట్రిక్ వేలిముద్ర) తప్పనిసరిగా చేయించుకోవాలి, కావున రైతు సోదరులు, మీ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీ e-క్రాప్ వివరాలను సరిచూసుకొని ఈ నెల 17 తేదీ లోగా e -KYC ( బయోమెట్రిక్ వేలిముద్ర) వేయాలి.
ఈ e -KYC ( బయోమెట్రిక్ వేలిముద్ర) వెయ్యని రైతులు ఇంకను 17% రైతులకు e -KYC ( బయోమెట్రిక్ వేలిముద్ర) జరగని కారణముగా ప్రభుత్వమూ వారు రేపు కుడా ఈ e -KYC ( బయోమెట్రిక్ వేలిముద్ర) వేసుకోనడానికి రైతు భరోసా కేంద్రానికి వెళ్లవలసినదిగా జిల్లా జాయింట్ కలెక్టరు గారు ఆదేశించారు. కావున అందరు రైతులు ఈ అవకాశాన్ని వినియోగింకోనవసినడిగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ వి .టి రామారావు ఇందుములముగా తెలియజేసారు.
రైతుల జాబితాను మాత్రమే ఈ నెల 19-తేదీ నుండి సామాజిక తనిఖీకోసం రైతు భరోసా కేంద్రాలలో వుంచటం జరుగుతుంది.e -KYC ( బయోమెట్రిక్ వేలిముద్ర) వెయ్యని రైతులు ప్రభుత్వం అమలు చేసే వివిధ పధకాల లబ్ది ని కోల్పోవడం జరుగుతుంది. కనుక రైతు సోదరులందరూ తప్పక e -KYC ( బయోమెట్రిక్ వేలిముద్ర) ని ఈ నెల 17 వ తేదీ లోగా చేయించుకోవాలి.
e -KYC ( బయోమెట్రిక్ వేలిముద్ర) లో యెమైనా ఇబ్బంది యేదురైనత్లైనా సదరు రైతులు జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబరు 8331056278 కు సంప్రదించగలరు.
ప్రభుత్వ పధకాలు, ఈ పంట పంట నమోదైనట్లు ఎస్.ఏం.ఎస్(SMS) మరియు పంటవివరములతో వున్న ధృవీకరణ పత్రం పొందాలన్నా e -KYC ( బయోమెట్రిక్ వేలిముద్ర) తప్పనిసరి . కావున రైతులు మీ రైతు భరోసా కేంద్రo లో వుండే సిబ్బందిని సంప్రదించి మీ e-క్రాప్ వివరాలను సరిచూసుకొని ఈ నెల 17 తేదీ లోగా e -KYC చేయించుకోవలసినదిగా జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు అదనపు జిల్లా మాజిస్త్రేట్ శ్రీ కే మయూర్ ఆశోక్ కోరుచున్నారు.
ఇట్లు
సంయుక్త కలెక్టర్, విజయనగరం జిల్లా