Close

District Collector A. Surya Kumari directed that in addition to providing quality nutritious food at Anganwadi Centers, weight and height should also be recorded accurately.

Publish Date : 18/12/2021

అంగన్వాడీ కేంద్రాలలో  బరువు తూకం  ఖచ్చితంగా ఉండాలి

ఫోర్టిఫైడ్ రైస్ పై అవగాహన ఉండాలి

కొత్తవలస లో అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

విజయనగరం, డిసెంబర్ 17::: అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన  పౌష్టికాహారాన్ని  అందించడం తో పాటు బరువు, ఎత్తులు కూడా ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు.  కొత్తవలస  మండలం  వియ్యంపేట, తుమ్మకపల్లి అంగన్వాడీ కేంద్రాలను శుక్రవారం  కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పిల్లల హాజరు పట్టిక పరిశీలించారు. వియ్యంపేట లో 10 మంది పిల్లలకు గాను 9 మంది హాజరయ్యారు.   పిల్లలతో పాటలు , రైమ్స్ పాడించారు. వారి పేర్లను. అడిగి వారితో సరదాగా ముచ్చటించారు. వారి వయసు, ఎత్తు, బరువు నమోదుల రిజిస్టర్ తనిఖీ చేసి సంతృప్తిని వ్యక్తం చేసారు. అక్కడే ఉన్న ప్రాధమిక పాఠశాలను తనిఖీ చేసి, తరగతి గదిలో  పిల్లలతో     మాట్లాడించారు.  అనంతరం తుమ్మకపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లల బరువు ను నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించి , బరువును తూచి  చూసారు. బాలుని బరువు  రిజిస్టర్ లో నమోదు చేసిన దానికి,   తేడా  ఉండడం తో సంబంధిత అంగన్వాడీ కార్యకర్త పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో సుమారు 10 కేజీ ల బరువు పెరుగుతాడా అంటూ నిలదీశారు. అంత తేడా వచ్చిందంటే సరిగ్గా  చూడడం లేదని , ఛార్జ్ మెమో జారీ చేయాలని  అక్కడే ఉన్న పి.డి రాజేశ్వరి కి ఆదేశించారు.  26 మంది నమోదు కాగా 13 మంది పిల్లలు మాత్రమే హాజరు కావడం పట్ల కారణాలను అడిగారు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు రావాలంటే సిబ్బంది బాధ్యతగా పని చేయాలని సూచించారు. అక్కడే ఉన్నఫోర్టిఫైడ్ బియ్యం బస్తా ను చూస్తూ ఈ బియ్యం పై అవగాహన ఉందా అని ప్రశ్నించారు. ఈ బియ్యం లో నున్న పెద్ద గింజల్లో  మినరల్స్, బి కాంప్లెక్స్ కలిసి ఉంటాయని, అన్నం ఉడికించేట ప్పుడు పిండి పదార్ధాలు ఉండడం వలన కొంచం మెత్త బడుతుందని, అదే బలవర్ధకమని కలెక్టర్ వివరించారు.  దీని పై మీకు పూర్తి గా అవగాహన ఉంటే ప్రజలకు చెప్పగలరని, ముందుగా మీరంతా తెలుసుకోవాలని అంగన్వాడీ సిబ్బందికి తెలిపారు.

    ఈ కార్యక్రమంలో ఎం.పి.పి. ఎన్. గోపమ్మ, సీడీపీఓ , సూపర్వైసర్ పాల్గొన్నారు.

District Collector A. Surya Kumari directed that in addition to providing quality nutritious food at Anganwadi Centers, weight and height should also be recorded accurately.