Close

District Collector A. Surya Kumari has directed the Department of Adult Education to ensure proper literacy program for the illiterate.

Publish Date : 03/12/2021

నిరక్షరాస్యు లైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడానికి  పడనా లిఖనా కార్యక్రమం

జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి

వయోజన విద్యా శాఖ ద్వారా నిరక్షరాష్యులను అక్షరాస్యులుగా చేసే పడనా లిఖనా కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు. జిల్లాలో   ఎంపిక చేసిన 10 మండలాల నుండి   15 నుండి 50 స0వ త్సరాల మధ్య గల 46 వేల  మందిని ఈ కార్యక్రమానికి గుర్తించినట్లు తెలిపారు.   బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పడనా లిఖనా అభియాన్ పై సమీక్షించారు. ఈ కార్యక్రమం క్రింద జిల్లాకు చేరిన అభ్యాసన పుస్తకాలు, వాలంటీర్ టీచర్స్ గైడ్ లు, హాజరు పట్టీలు  మండల కేంద్రాలకు వెంటనే సరఫరా చేయాలని ఆదేశించారు.  గ్రామ సచివాలయం లో నున్న విద్యా కార్యదర్శులకు శిక్షణ నిర్వహించి వారి ద్వారా వాలంటీర్ లకు శిక్షణ  ఇచ్చి తరగతులు పూర్తి చేయాలన్నారు. వచ్ఛే ఫిబ్రవరి 15   నాటికి పరీక్ష ద్వారా ప్రమోషన్ అస్సెస్ మెంట్ చేయాలన్నారు.

     ఈ సమావేశం లో వయోజన విద్యా ఉప సంచాలకులు కె.సుగుణాకర రావు, డి.ఈ.ఓ బ్రహ్మాజీ, సమగ్ర శిక్షా అభియాన్ పి.డి.స్వామినాయుడు, గిరిజన , బిసి సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.

District Collector A. Surya Kumari has directed the Department of Adult Education to ensure proper literacy program for the illiterate.