Close

District Collector A. Suryakumari announced that CEC and HEC groups will also be offered in English medium in government junior colleges from this year.

Publish Date : 25/06/2022

ఆంగ్ల మాధ్య‌మంలో ఇంట‌ర్ సిఇసి, హెచ్ఇసి గ్రూపులు

క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి

విజ‌య‌న‌గ‌రం, జూన్ 24 ః ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాలల్లో, ఈ ఏడాది నుంచి  ఆంగ్ల‌మాధ్య‌మంలో  సిఇసి, హెచ్ఇసి గ్రూపుల‌ను కూడా అందించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ప్ర‌క‌టించారు. విద్యార్థులు, వారి త‌ల్లితండ్రుల కోరిక మేర‌కు, నిపుణుల సూచ‌న‌ల‌కు అనుగుణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెళ్ల‌డించారు. విద్యార్థులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకొని, ఆస‌క్తి ఉన్న‌వారు ఆంగ్ల‌మాధ్య‌మంలోని సిఇసి, హెచ్ఇసి గ్రూపుల్లో చేరాల‌ని సూచించారు. జిల్లాలోని మొత్తం 18 ప్ర‌భుత్వ‌ జూనియ‌ర్ క‌ళాశాలల్లో ఆంగ్ల మాధ్య‌మంలో కూడా సిఇసి, హెచ్ఇసి గ్రూపుల బోధ‌న జ‌రుగుతుంద‌ని, ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం, ఈ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. ఈ నెల 20 నుంచి ద‌ర‌ఖాస్తుల జారీ ప్ర‌క్రియ మొద‌ల‌య్యింద‌ని, జులై 20లోగా పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను అంద‌జేయాల‌న్నారు.

District Collector A. Suryakumari announced that CEC and HEC groups will also be offered in English medium in government junior colleges from this year.