District Collector A. Suryakumari congratulated on behalf of the Revenue Officers’ Association as he has completed the year as a collector.
Publish Date : 30/07/2022
మీ పాలన స్పూర్తి దాయకం
జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపిన రెవెన్యూఅధికారులు
విజయనగరం, జూలై 29: జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టి నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్నందున రెవెన్యూ అధికారుల అసోషియోషన్ తరపున అభినందనలు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబరులో సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్ఓ గణపతిరావు, ఆర్.డి.ఓలు భవానీ శంకర్, శేషశైలజ, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు కలెక్టర్ ను కలసి ఆమె చిత్రపటాన్ని అందజేసారు. కలెక్టర్ కేక్ కట్ చేసి పంచుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులు కలెక్టర్ తో మాట్లాడుతూ మీ పాలన స్పూర్తిదాయకమని, సంవత్సర కాలంలో సమర్థవంతమైన పరిపాలనతో జిల్లాను అభివృద్ది పదంలో కొనియాడారు. రెవెన్యూ సంస్కరణలను చేపట్టి చక్కటి దిశా నిర్థేశం చేసారని డిఆర్ఓ గణపతిరావు అన్నారు.
