Close

District Collector A. Suryakumari congratulated the students who bagged the first place in the state level quiz competition

Publish Date : 25/03/2022

రాష్ట్రస్థాయిలో క్విజ్ పోటీలో మొదటి స్థానం సాధించిన విద్యార్థులను అభినందించిన

జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి

విజయనగరం, మార్చి, 16: ఫిబ్రవరి 28న నేషనల్ సైన్సు డే ను పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో వర్చువల్ విధానంలో నిర్వహించిన క్విజ్ పోటీలలో జిల్లాకు చెందిన డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులంలో చదువుచున్న ఐదుగురు విద్యార్థిని, విద్యార్థుల బృందానికి విజేతలుగా మొదటి స్థానం లభించగా వారిని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి అభినందించారు. కలెక్టర్ కార్యాలయంలో పార్వతీపురం, బాడంగి, గరుగుబిల్లి, నెల్లిమర్ల, వేపాడ మండలాలకు చెందిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుచున్న టి.రాకేష్, సి.హెచ్. ఉదయ్ భాస్కర్, జి.శ్రీలత, ఆర్. అనూష, 9వ తరగతి చదువుచున్న జి.లావణ్యల బృందం బుధవారం జిల్లా కలెక్టర్ ను కలసి వారి చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలను అందుకున్నారు. జిల్లా కలెక్టర్ వారితో ఉన్నత చదువులు చదివి, మంచి స్థానాలకు చేరాలని దీవించారు. జాయింట్ కలెక్టర్ (ఆసరా) వెంకటరావు, సోషల్ వెల్ఫేర్ జెడి సునీల్ రాజ్ కుమార్, ఎ.పి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ జిల్లా సమన్వయ అధికారి బి.చంద్రావతి పాల్గొన్నారు.

District Collector A. Suryakumari congratulated the students who bagged the first place in the state level quiz competition