Close

District Collector A. Suryakumari directed the officers to complete the convergence work in the agency area zones as per the set targets.

Publish Date : 06/01/2022

పనులకు సంబంధించి నిర్థేశించిన లక్ష్యాలను సాధించాలి

                జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి

విజయనగరం, జనవరి 05:  ఏజెన్సీ ప్రాంత మండలాలలో కన్వర్జెన్సీ పనులను నిర్థేశించిన లక్ష్యాల మేరకు పూర్తిచేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి అధికారులను ఆదేశించారు.  బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ట్రైబుల్ సబ్ ప్లాన్ కన్వర్జెన్సీ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంకా మొదలు పెట్టని (జీరో) పనులను వేగవంతంగా చేపట్టాలన్నారు. ఉద్యాన వన శాఖకు సంబంధించి భూ పరిక్షలు సక్రమంగా నిర్వహించాలన్నారు.  గృహ నిర్మాణాల పనులను త్వరితగతిన చేయాలన్నారు.  వైద్యఆరోగ్య శాఖలో ఖాళీలను త్వరగా భర్తీ చేయాలన్నారు.  నాడు నేడు పథకంలో భాగంగా అన్ని పి.హెచ్.సి.లు, సి.హెచ్.సిలలో పనులను వేగవంతం చేయాలన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ శతశాతం పూర్తిచేయాలన్నారు.  పశుసంవర్థక శాఖకు సంబంధించి కేటిల్ షెడ్లల నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు.  వై.ఎస్.ఆర్. చేయూతలో భాగంగా జగనన్న పాలవెల్లువ పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలన్నారు.  నీటిపారుదల శాఖలో మంజూరైన పనులను  వేగవంతం చేయాలన్నారు.  ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ రోడ్ల పనులను మారుమూల గ్రామాలలో ఇంటర్నల్ రోడ్ల నిర్మాణాలను చేపట్టాలన్నారు.  సమగ్రశిక్షకు సంబంధించి నాడు-నేడు పనులలో ఇంతవరకు మొదలు పెట్టని  పాఠశాలల భవనాలు, మరమ్మత్తులు ఉంటే వెంటనే పనులను చేపట్టాలన్నారు.  జగనన్న విద్యా కానుక, కెజిబివి  పాఠశాలలో సంక్షేమ పథకాలను శతశాతం అందించాలన్నారు.   డ్వామాకు సంబంధించి ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. 2021-22లో ఎస్.టి. వేజెస్ రూ. 61.16 కోట్ల రూపాయలను జిల్లాకు కేటాయించగా ఐటిడిఎ మండలాలకు రూ. 50.82 కోట్లను చెల్లించడం జరిగిందని, ఉద్యానవన శాఖకు సంబంధించి 67.98 గిరిజన రైతులు 7734.84  ఎకరాలలో సాగుచేసుకుంటున్నారన్నారని,  వై.ఎస్.ఆర్. జలకళకు సంబంధించి  132 దరఖాస్తులు రాగా 21 మందికి మంజూరురయ్యాయని డ్వామా  పి.డి. తెలిపారు.

        ఈ సమావేశంలో ఐటిడిఎ ప్రోజెక్టు అధికారి  కూర్మనాధ్, జిల్లా అధికారులు హాజరయ్యారు.

District Collector A. Suryakumari directed the officers to complete the convergence work in the agency area zones as per the set targets.