District Collector A. Suryakumari distribution of appointment letters to the candidates as part of the recruitment process for the recently undertaken contract and outsourcing jobs in the Department of Health.
Publish Date : 14/10/2022
ఉద్యోగాలకు వన్నెతేవాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ
విజయనగరం, అక్టోబరు 04 ఃబాగా కష్టపడి పనిచేసి, ఉద్యోగాలకు వన్నె తేవాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కోరారు. వైద్యారోగ్యశాఖలో ఇటీవల చేపట్టిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా, డిసిహెచ్ఎస్, వైద్య కళాశాల పరిధిలో జనరల్ డ్యూటీ అటెండెంట్స్, ఆఫీస్ సబార్డినేట్స్, పోస్టుమార్టమ్ అసిస్టెంట్స్ ఉద్యోగాలకు ఎంపికైన 55 మంది అభ్యర్ధులకు మంగళవారం కలెక్టరేట్‌లో నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వైద్యారోగ్యశాఖలో ఉద్యోగం చేయడానికి, ఎంతో సహనం, ఓర్పు ఉండాలని, వాటిని అలవర్చుకోవాలని సూచించారు. సేవా రంగంలో గొప్ప సంతృప్తిని ఇచ్చే ఉద్యోగాలు ఇవని పేర్కొన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, శాఖకు మంచి పేరు తేవాలని కలెక్టర్ కోరారు. వివిధ కారణాలతో భర్తీకాకుండా మిగిలిపోయిన 18 పోస్టులకు, వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించి, నియామకాలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మలీల, ఇతర అధికారులు పాల్గొన్నారు.