Close

District Collector A. Suryakumari stated that following the orders issued by the state government, plastic flexi is completely banned from November 1st.

Publish Date : 21/10/2022

*నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పూర్తిగా నిషేధం*
@వినియోగించినా, ముద్రించినా చర్యలు తప్పవు
@ఫ్లెక్సీ ప్రింటర్లతో జరిగిన సమావేశంలో కలెక్టర్ సూర్యకుమారి

విజయనగరం, అక్టోబర్ 17:- రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అనుసరించి నవంబర్ ఒకటో తారీఖు నుంచీ ప్లాస్టిక్ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకు వ్యవహరించాలని అలా కానిచో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకటో తారీఖు నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ముద్రించినా.. వినియోగించినా పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 65 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫ్లెక్సీల నిషేధం నేపథ్యంలో జిల్లాలోని ఫ్లెక్సీ ప్రింటర్లతో, మున్సిపాలిటీల కమిషనర్లతో స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 65లో పేర్కొన్న అంశాలను వివరించారు. చట్టాన్ని అందరూ గౌరవించాలని పేర్కొన్నారు. వీటికి ప్రత్యామన్యాయ మార్గాలను అనుసరించాలని సూచించారు. క్లోత్ లేదా ఎల్.ఈ.డి. సైన్ బోర్డులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపిచ్చారు. ఒకటో తారీఖు నుంచి ఫ్లెక్సీలు ముద్రించినట్లయతే అడుగుకి రూ.100 చొప్పున తయారీ దారులపై జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

*ఉపాధికి ఇబ్బంది లేకుండా చర్యలు*

ఉన్న ఫలంగా చేస్తున్న పని మానేసి ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కల్పనలు యంత్రాంగం తరఫు నుంచి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణలు అందించటం ద్వారా ఇతర ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు ఉన్న మెషీన్ల స్థానంలో వెరేవి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం తరఫున తగిన సహాయ, సహకారాలు అందిస్తామని కలెక్టర్ సూర్యకుమారి పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు తోడుగా ఉంటామని చెప్పారు.

సమావేశంలో విజయనగరం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ రాములు నాయుడు, బొబ్బిలి మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావు, పరిశ్రమల శాఖ జీఎం పాపారావు, ఫ్లెక్సీ ప్రింటర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు .

District Collector A. Suryakumari stated that following the orders issued by the state government, plastic flexi is completely banned from November 1st.