Close

District Collector Smt. A. Suryakumari directed the authorities to give utmost priority to the implementation of education, youth welfare and skill training programs during this summer.

Publish Date : 04/05/2022

విద్య‌, నైపుణ్య శిక్ష‌ణ‌కు ప్రాధాన్య‌త‌
గృహ‌నిర్మాణాన్ని నిరంత‌రం త‌నిఖీ చేయాలి
ర‌బీలో ప్ర‌త్యామ్నాయ పంట‌ల సాగుపై దృష్టి పెట్టండి
జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి
విజ‌య‌న‌గ‌రం, మే 02 ః
              ఈ వేస‌వి కాలంలో విద్య‌, యువ‌జ‌న సంక్షేమం, నైపుణ్య శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల అమ‌లుకు అత్య‌ధిక ప్రాధాన్య‌త నివ్వాల‌ని, అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో స్పంద‌న విన‌తులు, వివిధ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌పై క‌లెక్ట‌ర్ స‌మీక్షించారు. స్పంద‌న విన‌తుల‌ను, నిర్ణీత గ‌డువులోగా ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. వివిధ శాఖ‌ల్లో పేరుకుపోయిన విన‌తుల‌పై, సంబంధిత అధికారుల‌ను ప్ర‌శ్నించారు.
               ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, ఈ వేస‌వి సెల‌వుల‌ను విద్యార్థులు, యువ‌త స‌ద్వినియోగం చేసుకొనే విధంగా శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని సూచించారు. మండ‌లాల ప్ర‌త్యేకాధికారులు, ఇంట‌ర్ పరీక్ష‌లు ముగిసేవ‌ర‌కూ, ప్ర‌తీరోజూ ప‌రీక్షా కేంద్రాల‌ను త‌నిఖీ చేయాల‌ని సూచించారు. అలాగే జ‌గ‌న‌న్న గృహ‌నిర్మాణా కార్య‌క్ర‌మానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త‌నిచ్చి, నిరంత‌రం హౌసింగ్ కాల‌నీల‌ను సంద‌ర్శించాల‌ని ఆదేశించారు. భ‌వ‌న నిర్మాణాల స్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ఆన్‌లైన్లో అప్‌డేట్ చేయాల‌న్నారు. క‌న్వ‌ర్జెన్సీ స‌మావేశాన్ని ఇటీవ‌లే నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని, క‌న్వ‌ర్జెన్సీ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని అన్నారు. ర‌బీలో ప్ర‌త్యామ్నాయ పంట‌ల సాగుపై దృష్టి పెట్టాల‌ని సూచించారు. నీతి అయోగ్ సూచిక‌ల్లో, జిల్లా ర్యాంకులను మ‌రింత మెరుగు ప‌ర్చేందుకు కృషి చేయాల‌ని కోరారు.
              మండ‌ల ప్ర‌త్యేకాధికారిగా ప‌నిచేయ‌డం ఒక గౌర‌వ‌మ‌ని, గొప్ప అవ‌కాశమ‌ని పేర్కొన్నారు. ప్ర‌త్యేకాధికారులు మండ‌లాల్లో ప‌ర్య‌టించే స‌మ‌యంలో, త‌మ దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను, స‌ల‌హాల‌ను, లోపాల‌ను, వెంట‌వెంట‌నే త‌మ‌కు తెలియజేయాల‌ని సూచించారు. మ‌రో 15 రోజుల్లో జిల్లా స‌మీక్షామండ‌లి స‌మావేశం  జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని, దీనికి సిద్దం కావాల‌ని, అవ‌స‌ర‌మైన స‌మాచారంతో నోట్సులు త‌యారు చేయాల‌ని ఆదేశించారు. గ‌త స‌మీక్షా స‌మావేశ‌పు అజెండాలో చ‌ర్చించిన అంశాలు, వేసిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను సిద్దం చేయాల‌ని సూచించారు. వివిధ శాఖ‌ల్లో ఖాళీల‌ను భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.  ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, స్పెష‌ల్ డిప్యుటీ క‌లెక్ట‌ర్లు బి.ప‌ద్మావ‌తి, సూర్య‌నారాయ‌ణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
District Collector Smt. A. Suryakumari directed the authorities to give utmost priority to the implementation of education, youth welfare and skill training programs during this summer.