District development should be done with the blessings of Goddess, Collector who worshiped Sirimanu
Publish Date : 08/10/2021
అమ్మవారి ఆశీస్సులతో జిల్లా అభివృద్ధి జరగాలి
సిరిమానుకు పూజలు
అమ్మవారి ఆశీస్సులతో జిల్లా అభివృద్ధి జరగాలి
సిరిమానుకు పూజలు చేసిన కలెక్టర్
అక్టోబరు 02:: డెంకాడ మండలం చందక పేట లో పైడితల్లి అమ్మవారి సిరిమాను పూజలు శనివారం ఘనంగా నిర్వహించారు. పూజారి కలలో కనపడిన అమ్మవారు ఈ సంవత్సరం సిరిమాను కోసం చందకపేట లో నున్న చింత చెట్టును చూపించిన నేపథ్యం లో అక్కడ సిరిమానును గుర్తించారు. దేవస్థానం ఈ.ఓ అద్వర్యం లో సిరిమానును శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి పాల్గొని అమ్మవారి సిరిమానును పసుపు కుంకుమలతో పూజలు చేసి, ముందుగా గొడ్డలి తో గాటు పెట్టారు. అనంతరం ఈ మానును తరలించి సిరిమాను గా తయారు చేస్తారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని, జిల్లా అన్నింటా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్, నగర మేయర్ వెంపడపు విజయ లక్ష్మి, డిప్యూటి మేయర్లు రేవతి దేవి కోలగట్ల శ్రావణి, ఆర్.డి.ఓ భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు. చేసిన కలెక్టర్
అక్టోబరు 02:: డెంకాడ మండలం చందక పేట లో పైడితల్లి అమ్మవారి సిరిమాను పూజలు శనివారం ఘనంగా నిర్వహించారు. పూజారి కలలో కనపడిన అమ్మవారు ఈ సంవత్సరం సిరిమాను కోసం చందకపేట లో నున్న చింత చెట్టును చూపించిన నేపథ్యం లో అక్కడ సిరిమానును గుర్తించారు. దేవస్థానం ఈ.ఓ అద్వర్యం లో సిరిమానును శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి పాల్గొని అమ్మవారి సిరిమానును పసుపు కుంకుమలతో పూజలు చేసి, ముందుగా గొడ్డలి తో గాటు పెట్టారు. అనంతరం ఈ మానును తరలించి సిరిమాను గా తయారు చేస్తారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని, జిల్లా అన్నింటా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్, నగర మేయర్ వెంపడపు విజయ లక్ష్మి, డిప్యూటి మేయర్లు రేవతి దేవి కోలగట్ల శ్రావణి, ఆర్.డి.ఓ భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.