Engineering assistants should be responsible for the construction of houses, upload the employment bills by the end of the month, District Collector Suryakumari orders, online meeting with MPDOs, district officials
Publish Date : 29/03/2022
ఇళ్ల నిర్మాణంలో ఇంజనీరింగ్ సహాయకులు బాధ్యత వహించాలి
నెలాఖరులోగా ఉపాధి పనుల బిల్లులు అప్ లోడ్ చేయాలి
జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆదేశాలు
ఎం.పి.డి.ఓలు, జిల్లా అధికారులతో ఆన్ లైన్ సమావేశం
విజయనగరం, మార్చి 28 :జిల్లాలో జగనన్న ఇళ్ల కాలనీల్లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల్లో గ్రామ ఇంజనీరింగ్ సహాయకుల పాత్ర అధికంగా వుండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం చేపట్టేలా లబ్దిదారుల్లో ప్రేరణ కలిగించడంలో వారు అధికంగా బాధ్యత తీసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో బాధ్యత వహించని ఇంజనీరింగ్ సహాయకులపై చర్యలకు వెనుకాడబోమన్నారు. లే అవుట్లతో పాటు సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొనే లబ్దిదారులందరినీ ఇళ్ల నిర్మాణం చేపట్టేలా గ్రామ, మండల స్థాయి అధికారులు ప్రోత్సహించాలని, దీనిపై అధికంగా దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని ఎం.పి.డి.ఓ.లు, మునిసిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులతో పలు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆన్ లైన్ ద్వారా సోమవారం సాయంత్రం సమీక్షించారు. ఇళ్ల నిర్మాణానికి ఇదే సరైన సమయమని, ఇళ్లు నిర్మించుకొనే వారికి సిమెంటు సరఫరా, సకాలంలో బిల్లుల చెల్లింపు వంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నందున వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని జాయింట్ కలెక్టర్(హౌసింగ్) మయూర్ అశోక్ అన్నారు.
జిల్లాలో ఉపాధి నిధులతో చేపట్టే కన్వెర్జన్స్ పనులకు సంబంధించి పూర్తిచేసిన పనులకు బిల్లులు తక్షణమే అప్ లోడ్ చేయించాలని ఎంపిడిఓలను కలెక్టర్ ఆదేశించారు. పూర్తిచేసి అప్ లోడ్ చేసిన పనులన్నింటికీ మార్చి 31వ తేదీన నిధులు విడుదల చేశామని రాష్ట్ర స్థాయి అధికారులు తెలియజేశారని జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) డా.ఆర్.మహేష్ కుమార్ చెప్పారు. అందువల్ల ఎంపిడిఓలంతా తమ మండలాల్లో చేసిన పనులపై అప్ లోడ్ చేయించేలా దృష్టిసారించాలన్నారు.
జిల్లాలో జరుగుతున్న ఉపాధి పనులకు సంబంధించి 17 మండలాల్లో పనుల్లో పాల్గొంటున్న వేతనదారులకు సంబంధించిన పనిదినాలు ఆన్ లైన్లో అప్ లోడ్ చేయడంలో విఫలమైన ఎంపిడిఓలకు మెమోలు జారీచేయాలని డ్వామా పి.డి.ని ఆదేశించారు. ఉపాధి పనులను తమకు సంబంధం లేనివిగా భావించవద్దని ఎంపిడిఓలంతా మండలంలో జరిగే ఉపాధి పనుల్లో పూర్తిస్థాయిలో పాల్గొనాలని స్పష్టంచేశారు.
పంటనూనెలు ధరలు పెరగకుండా చూడాల్సి వుందని, అదేవిధంగా ప్రజలందరికీ అందుబాటులో తగినంతగా వంటనూనెలు లభించేలా చర్యలు చేపడుతున్నట్టు జిల్లా కలెక్టర్ చెప్పారు. వంటనూనెలు విక్రయించేందుకు మునిసిపాలిటీల్లో తగిన స్థలాలను ఆయా మునిసిపాలిటీల్లో కేటాయించాలని జాయింట్ కలెక్టర్ డా.మహేష్ కుమార్ చెప్పారు.
జగనన్న సంపూర్ణ గృహహక్కు, గ్రామ వార్డు సచివాలయ సేవలు, జగనన్న చేదోడు, జలకళ, జల్ జీవన్ మిషన్, ఎలక్ట్రికల్ మీటర్ల ఏర్పాటు వంటి అంశాలపై ఆన్ లైన్ సమావేశంలో చర్చించారు
