Close

Fake messages in the name of District Collector should be alert: District Collector A. Suryakumari

Publish Date : 25/03/2022

జిల్లా క‌లెక్ట‌ర్ పేరుతో ఫేక్ మెసేజ్‌లు

అప్ర‌మ‌త్తంగా ఉండాలి ః జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి

విజ‌య‌న‌గ‌రం, మార్చి 21 ః జిల్లా ఉన్న‌తాధికారులు, క‌లెక్ట‌ర్‌ పేరుతో గ‌త కొద్దిరోజులుగా వ‌స్తున్న ఫేక్ మెసేజ్‌ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి సూచించారు. జిల్లా క‌లెక్ట‌ర్ ప్రొఫైల్ ఫొటోతో, సెల్ నెంబ‌ర్లు 9439140791, 9439140733, 9439139978, 7381276244 నుంచి వాట్సాప్ ద్వారా, పలు ఆదేశాలు, సూచ‌న‌లు వెలువ‌డుతున్నాయ‌ని, వీటితో జిల్లా యంత్రాంగానికి ఎటువంటి సంబంధ‌మూ లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఫోన్ నంబర్లు నుంచి వచ్చే ఆదేశాలను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని జిల్లా అధికారుల‌కు, సిబ్బందికి, ప్ర‌జ‌ల‌కు సూచించారు. ఇలా ఎవరికైనా మెసేజ్ లు వచ్చినట్లయితే, తమ ఉన్నతాధికారులకు సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. దీనిపై ఇప్ప‌టికే పోలీసుల‌కు స‌మాచారాన్ని అంద‌జేయ‌డం జ‌రిగింద‌ని, చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

Fake messages in the name of District Collector should be alert: District Collector A. Suryakumari