Close

Government Departments should work in coordination to prevent maternal and infant mortality Awareness on breastfeeding should be provided District Collector A. Suryakumari

Publish Date : 16/05/2022

మాతృ, శిశు మ‌ర‌ణాల‌ను అరిక‌ట్టాలి
ప్ర‌భుత్వ శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి
త‌ల్లిపాల వినియోగంపై అవ‌గాహ‌న క‌ల్పించాలి
జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి

విజ‌య‌న‌గ‌రం, మే 13 ః
ప్ర‌సూతి మ‌ర‌ణాలను అరిక‌ట్టేందుకు మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి కోరారు. దీనికోసం స్త్రీ శిశు సంక్షేమం, వైద్యారోగ్య‌శాఖ స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సూచించారు. ఏప్రెల్ నెల‌లో జ‌రిగిన మాతృ, శిశు మ‌ర‌ణాల‌పై, క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో శుక్ర‌వారం  డెత్ ఆడిట్ నిర్వ‌హించారు. ఒక్కో మృతిపైనా సంబంధిత వైద్యాధికారి, ఎఎన్ఎం, ఆశావ‌ర్క‌ర్‌, అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల‌ను ప్ర‌శ్నించారు. వాటికి కార‌ణాల‌ను, సీనియ‌ర్ వైద్యాధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, ప్ర‌సూతి మ‌ర‌ణాల‌ను అరిక‌ట్టాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌న్నారు. దీనికోసం అందుబాటులో ఉన్న అన్ని వ‌నరుల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా వినియోగించుకొని మెరుగైన ప‌నితీరును క‌న‌ప‌ర్చాల‌ని సూచించారు. గ‌ర్భం దాల్చిన ద‌గ్గ‌ర‌నుండి, అవ‌స‌ర‌మైన అన్ని  ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి, అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు, సూచ‌న‌లు, మందులు, పోష‌కాహారాన్ని అందించాల‌ని చెప్పారు

Government Departments should work in coordination to prevent maternal and infant mortality Awareness on breastfeeding should be provided District Collector A. Suryakumari