Housing needs to be accelerated, said District Collector Surya Kumari
Publish Date : 28/04/2022
👉గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి
👉 జిల్లా కలెక్టర్ సూర్య కుమారి
విజయనగరం, ఏప్రిల్ 27:: జగనన్న కాలనీ లలో గృహ నిర్మాణాలు వేగవంతం కావాలని, లబ్దిదారులను చైతన్యం చేసి నిర్మాణాలకు ముందుకు వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో గృహ నిర్మాణాలు , మౌలిక వసతుల కల్పన పై ఆమె సమీక్షించారు. రోజు వారీ లక్ష్యాలను నిర్దేశించుకొని , కాంట్రాక్టర్లు తో మాట్లాడుకోవాలని , గ్రౌండింగ్స్ వేగంగా జరగాలని అన్నారు. ప్రతి వారం పురోగతి కనపడాలని సూచించారు. ఇంటర్నల్ రోడ్లు, విద్యుత్ పోల్స్, వెంటనే ఎస్టిమేషన్లు వేయాలన్నారు. ఇప్పటికే ప్రారంభమైన గృహాలకు వెంట వెంటనే మీటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ ఎస్.ఈ కు సూచించారు.
సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్లు హాజరు కావడం లేదని , తప్పకుండా హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని, ఇక పై సచివాలయం తనిఖీలలో వారు కనపడకపోతే సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, హౌసింగ్ పి.డి రమణ మూర్తి, ఎస్.ఎస్.ఏ పి.ఓ స్వామి నాయుడు, మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వాణి, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ రామ చంద్ర రావు, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఈ.పి.డి.సి.ఎల్ ఎస్.ఈ లు పాల్గొన్నారు.