If the millers do not cooperate the licenses will be revoked permanently, said District Collector Surya Kumari
Publish Date : 04/01/2022
మిల్లర్లు సహకరించకపోతే లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేస్తాం
రెండు రోజుల్లో కనీసం వంద బి.జి లు రావాలి
ఉదయం 7 గంటలకే ఆర్.బి.కే లు తెరవాలి
గన్నీ సంచులను వెంటనే ఏర్పాటు చేయాలి
` జిల్లా కలెక్టర్ సూర్య కుమారి
విజయనగరం, జనవరి 03 : ధాన్యం కొనుగోళ్లకు సహకరించని మిల్లర్ల లైసెన్స్ లను శాశ్వతంగా రద్దు చేసి, ప్రభుత్వం నుండి వచ్చే సహకారాన్ని ఆపివేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి హెచ్చరించారు. సోమవారం ఆమె ఛాంబర్ లో పౌర సరఫరాల అధికారులు, మిల్లర్ల సంఘం సభ్యులతో ధాన్యం సేకరణ పై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గన్నీ సంచులు ఎక్కెడెక్కడ ఖాళీ గా ఉన్న సంచులన్నిటిని ఆర్.బి.కే ల్లో ఉంచాలని సూచించారు. గన్నీ లు సరిపడక పోతే తర్పాలీన్ లో నైనా తరలించే ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. అన్ని ఆర్.బి.కే లు ఉదయం 7 గంటలకే తెరవాలని, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆ మేరకు అందరికీ ఆదేశాలు పంపాలని వ్యవసాయ శాఖ జే.డి రామారావు కు సూచించారు. రోజుకు కనీసం 25 వేల మెట్రిక్ టన్నులు లిఫ్ట్ చేయాలనీ, 10 వేల మెట్రిక్ టన్నుల సి.ఎం.ఆర్ రావాలని ఆదేశించారు. కొనుగోళ్ళు చేసిన వారికీ చెల్లింపులు 21 రోజుల్లో అందేలా చూడాలని పౌర సరఫరాల జిల్లా మేనేజర్ కు ఆదేశించారు. . వచ్చే రెండు రోజుల్లో కనీసం వంద బి.జి. లు రావాలని, బి.జి. లు ఇచ్చిన మిల్లర్లు లిఫ్టింగ్ వెంటనే మొదలు పెట్టాలని, నూర్పు అయిన ధాన్యం కళ్ళం లో కనపడకూడదని అన్నారు. జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాల కు కూడా ధాన్యాన్ని పంపించే ఏర్పాట్లను చేయాలనీ, మిల్లర్ల తో మాట్లాడి వెంటనే లిఫ్టింగ్ చేయాలనీ ఆదేశించారు. అధికారులంతా వెంటనే క్షేత్ర స్థాయి ల,ఓ పర్యటనలు చేసి పర్యవేక్షించాలని , ప్రతి పూటకు నివేదికలివ్వాలని అన్నారు. ప్రతి మిల్లు దగ్గర ఒక సి.ఎస్.డి.టి, వి.ఆర్.ఓ లను పర్యవేక్షణ కోసం నియమించాలన్నారు. మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే రైతులు బయట కూడా అమ్ముకోవచ్చునని రైతులకు చెప్పాలన్నారు. తేమ యంత్రాలను మిల్లర్ల వద్ద కాకుండా రైతు భరోసా కేంద్రాల వద్ద నే రీడింగ్ తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి పాపా రావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ డి. నాయక్, వ్యవసాయ శాఖ జే.డి. రామ రావు, టెక్నికల్ అధికారి మీనా కుమారి, మిల్లర్ల సంఘం అధ్యక్షులు కొండబాబు, తదితరులు పాల్గొన్నారు.