Italian couple who adopted an Indian girl * handed over the girl in the presence of Collector Suryakumari
Publish Date : 23/05/2022
భారతీయ బాలికను దత్తత తీసుకున్న ఇటలీ దంపతులు
*కలెక్టర్ సూర్యకుమారి సమక్షంలో బాలికను అప్పగించిన అధికారులు
విజయనగరం, మే 21 ః విజయనగరంలోని శిశుగృహలో ఆసరా పొందుతున్న వర్షిణీ అనే నాలుగేళ్ల భారతీయ బాలికను ఇటలీకి చెందిన దంపతులు స్టాన్కానెల్లి జియాన్కార్లో, కావల్లారో సిల్వానా దత్తత తీసుకున్నారు. కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) నిబంధనల ప్రకారం దత్తత ప్రక్రియ పూర్తి కాగా జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి సమక్షంలో ఐసీడీఎస్ అధికారులు శనివారం సంబంధిత బాలికను ఇటలీ దంపతులకు అప్పగించారు. బాలిక పేరుపై తీసుకున్న జనన ధృవీకరణ ప్రతం, పాస్‌పోర్టు ఇతర పత్రాలను కలెక్టర్ చేతుల మీదుగా ఇటలీ దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా వర్షిణీతో కాసేపు కలెక్టర్ సూర్యకుమారి ముచ్చటించారు. దగ్గరకు తీసుకొని ముద్దాడారు. దత్తత తీసుకున్న ఇటలీ దంపతులను కలెక్టర్ అభినందిస్తూ బాగా చూసుకోవాలని, బాగా చదివించాలని సూచించారు.
ఐసీడీఎస్ పీడీ బి. శాంతకుమారి, సీడబ్ల్యూసీ (చైల్ట్ వెల్ఫేర్ కమిటీ) ఛైర్ పర్శన్ హిమబిందు, శిశు గృహ మేనేజర్ బి. శ్రీధర్, డీసీపీవో (డిస్ట్రిక్ట్ ఛైల్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్) నాయుడు తదితరులు పాల్గొన్నారు.
