• Site Map
  • Accessibility Links
  • English
Close

JC (Revenue), District Officers with the participation of Central Officers reviewing the Clean Air Program in an online conference

Publish Date : 03/11/2021

క్లీన్ ఎయిర్ కార్య‌క్ర‌మంపై స‌మీక్ష‌
ఆన్ లైన్‌ కాన్ఫ‌రెన్సులో స‌మీక్షించిన కేంద్ర అధికారులు
పాల్గొన్న జె.సి.(రెవిన్యూ), జిల్లా అధికారులు

విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 2; జాతీయ క్లీన్ ఎయిర్ కార్య‌క్ర‌మంపై ఏర్పాటైన ఐదో ప‌ర్య‌వేక్ష‌క‌ క‌మిటీ స‌మావేశం మంగ‌ళ‌వారం ఆన్ లైన్ ద్వారా జ‌రిగింది. కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ‌శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి న‌రేష్‌పాల్ గంగ‌వ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో దేశంలోని అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు, జిల్లా యంత్రాంగాల ప్ర‌తినిధులు, రాష్ట్రాల కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ఛైర్మ‌న్‌లు, కార్య‌ద‌ర్శులు పాల్గొన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం నుంచి జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్‌, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్‌.ఎస్‌.వ‌ర్మ‌, కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ఇంజ‌నీర్ సుద‌ర్శ‌నం త‌దిత‌రులు పాల్గొన్నారు. జాతీయ క్లీన్ ఎయిర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌కు నిధుల విడుద‌ల‌, వాటి వినియోగం, ఈ కార్య‌క్ర‌మ ల‌క్ష్యాల సాధ‌న‌కు నిర్ధుష్ట కాల‌ప‌రిమితి నిర్ణ‌యం వంటి అంశాల‌పై చ‌ర్చించిన‌ట్టు కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ఇంజ‌నీర్ సుద‌ర్శ‌నం తెలిపారు.

JC (Revenue), District Officers with the participation of Central Officers reviewing the Clean Air Program in an online conference