Joint Collector Extensive Visit at Field Level * * Re-Survey Process Inspection, Tenth Inspection of Testing Centers
Publish Date : 28/04/2022
*క్షేత్రస్థాయిలో జాయింట్ కలెక్టర్ విస్తృత పర్యటన*
*రీ-సర్వే ప్రక్రియ పరిశీలన, పదో తరగతి పరీక్షా కేంద్రాల తనిఖీ
విజయనగరం, ఏప్రిల్ 27 ః జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ క్షేత్రస్థాయిలో బుధవారం విస్తృత పర్యటన చేశారు. దీనిలో భాగంగా భూముల రీ-సర్వే ప్రక్రియను పరిశీలించారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రాంభద్రపురం తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి స్థానిక అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం స్థానిక ఉన్నత పాఠశాలలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు సజావుగా జరిగేలా బాధ్యతగా వ్యవహరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే స్థానికంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును, మధ్యాహ్న భోజన పథకాన్ని జేసీ పరిశీలించారు. రీ సర్వే ప్రక్రియ ప్రణాళికాయుతంగా చేయాలని, నిర్ణీత కాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కె.ఆర్.ఆర్.సి. ప్రత్యేక ఉప కలెక్టర్ సూర్యనారాయణ, సర్వే విభాగం సహాయ సంచాలకులు త్రివిక్రమరావు, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.
