Must work with justice and honesty – Collector A. Suryankumari instructed the District Officers , Officers who pledged collectively as part of Vigilance Week
Publish Date : 02/11/2021
*నీతి, నిజాయితీలతో పని చేయాలి*
*జిల్లా అధికారులకు సూచించిన కలెక్టర్ ఎ. సూర్యకుమారి
*విజిలెన్స్ వీక్లో భాగంగా సమూహంగా ప్రతిజ్ఞ చేసిన అధికారులు
విజయనగరం, నవంబర్ 01 ః జిల్లాలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది నీతి, నిజాయితీలతో ఉండాలని, అవినీతి రహిత పాలన అందించాలని కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. స్వచ్ఛంగా ఉంటూ ప్రజలకు నిష్పక్షపాత సేవలందించాలని సూచించారు. విజిలెన్స్ వీక్ లో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ముందుగా జిల్లా అధికారుల చేత కలెక్టర్ సూర్యకుమారి ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ వారికి ఉత్తమమైన సేవలందించాలని, అందరికీ ఆదర్శంగా నిలిచేలా పని చేయాలని అధికారులకు సూచించారు. చిన్నచిన్న విషయాల్లో పొరపాట్లు చేయటం.. ఇతరుల ఒత్తిడికి తలొగ్గి అవినీతికి పాల్పడవద్దని, ఉద్యోగ జీవితాలకు మచ్చ తెచ్చుకోవద్దని కలెక్టర్ హితవు పలికారు. అనంతరం విజిలెన్స్ డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ ప్రతి అధికారీ బాధ్యతగా పని చేయాలని, అవినీతికి పాల్పడకుండా ప్రజలకు సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాని విధంగా పని చేయాలని సూచించారు. విజిలెన్స్ వీక్లో భాగంగా ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని, అవినీతి రహిత సమాజం నిర్మాణం కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
కార్యక్రమంలో జేసీలు కిశోర్ కుమార్, మహేశ్ కుమార్, మయూర్ అశోక్, వెంకటరావు, డీఆర్వో గణపతిరావు, విజిలెన్స్ డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఇతర జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
