National flag should be hoisted on every house @ Har Ghar Tiranga Utsavalu to inculcate the sense of patriotism @ District Collector Mrs. A. Suryakumari
Publish Date : 28/07/2022
@ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
@ దేశభక్తి భావన పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు
@ ఆగష్టు 11 నుంచి 15 వరకు నిర్వహణ
@ ప్రముఖ స్థలాల్లో జాతీయ జెండా సెల్ఫీ పాయింట్లు
@ 13న మండల స్థాయిల్లో తిరంగా ర్యాలీలు
@ జాతీయజెండాతో సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేస్తే ఆన్ లైన్‌లో సర్టిఫికెట్లు జారీ
@ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
@ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి
విజయనగరం, జూలై 26 : ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన పెంపొందించేలా జిల్లాలో హర్ ఘర్ తిరంగా ఉత్సవాలను నిర్వహించి ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా చర్యలు చేపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్ అన్ని వర్గాల ప్రజలందరూ ఆగష్టు 11 నుంచి 15 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భాగస్వాములయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికీ జాతీయ జెండా పంపిణీ చేయించడంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రముఖ ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు వున్న ప్రాంతాల్లో ప్రజలు జాతీయ జెండాతో సెల్ఫీ తీసుకునేలా సెల్ఫీ పాయింట్లు అధికంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరంలోని ప్రముఖ చారిత్రక కట్టడాల వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నాలుగు సెల్ఫీ పాయింట్లు ఏర్పాటుతో పాటు బస్ స్టేషన్లలో కూడా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. హర్ ఘర్ తిరంగా ఉత్సవాలపై కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. ప్రజల్లో దేశభక్తి భావన పెంపొందించేలా విద్యార్ధులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం వంటి పోటీలను నిర్వహించాలని విద్యా శాఖ అధికారులకు సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు తమ కార్యాలయాల వద్ద బయట గోడపై ఆజాది కా అమృత్ మహోత్సవాలపై పెయింటింగ్ చేయించాలని సూచించారు.
జాతీయ జెండాతో సెల్ఫీ దిగి హర్ ఘర్ తిరంగా వెబ్ సైట్‌లో ఆఫోటోను పోస్టు చేసే వారికి ఆన్ లైన్‌లో సర్టిఫికెట్లు జారీ అవుతాయని ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఈనెల 13న జిల్లా వ్యాప్తంగా జాతీయ పతాకం చేతబూని హర్ ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు తమ పరిధిలో వున్న వినియోగదారులు, లబ్దిదారులతో సెల్ఫీలు తీయించి ఆన్ లైన్ వెస్ సైట్లలో ఆయా ఫోటోలు పోస్ట్ చేయించాలన్నారు. రైతులు, స్వయంశక్తి మహిళలు, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు తదితర అన్నివర్గాల వారు ఈ జాతీయ ఉత్సవంలో భాగస్వాములయ్యేలా ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ నీటిసరఫరా విభాగం ఆధ్వర్యంలోని రక్షిత నీటి సరఫరా స్టోరేజీ ట్యాంకులన్నింటిపై ఆజాది కా అమృత మహోత్సవాల నినాదాలు, లోగోలు ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని పర్యవేక్షక ఇంజనీర్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తమ శాఖల పరిధిలో చేపట్టనున్న కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులు వివరించారు.
జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
