Close

National level award for blind student in music, congratulated by District Collector Mrs. Suryakumari

Publish Date : 25/11/2021

సంగీతంలో అంధ విద్యార్థికి జాతీయ స్థాయి అవార్డు

అభినందించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి

భువనేష్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలి – జిల్లా కలెక్టర్

విజయనగరం, నవంబర్ 24: జాతీయ స్థాయి లో అవార్డు తీసుకున్న భువనేష్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లో   బుధవారం  ద్వారకామాయి అందుల పాఠశాల  వ్యవస్థాపకులు మాచేపల్లి ఆశాజ్యోతి, విద్యార్థి భువనేష్ జిల్లా కలెక్టర్ ను  మర్యాద పూర్వకంగా కలిశారు. నవంబర్ 20న ‘ఇంటర్ నేషనల్ చిల్డ్రన్స్ డే “సందర్భంగా విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారు ఏర్పాటు చేసిన జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులు  హైదరాబాద్ లో అందించారు.

    ఈ అవార్డుకు ద్వారకామాయి పాఠశాల లో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి పతివాడ భువనేష్ ఎంపికై హైదరాబాద్ కలెక్టర్ ఎల్. శర్మన్.చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. **విశ్వగురు వరల్డ్ రికార్డ్స్*” సంస్థ ఆధ్వర్యంలో ఈ అవార్డు అందించటం జరిగింది. భువనేష్ కి సంగీతం లో ఈ అవార్డును అందజేశారు. భువనేష్ తల్లిదండ్రులు శ్రీకృష్ణదేవరాయలు, లీలావతి ప్రోత్సాహం ఎంతో దాగి ఉందని ఈ సందర్భంగా ఆశాజ్యోతి కలెక్టర్ కు వివరించారు. ఈ విద్యార్థి కోడూరు ప్రకాష్ అనే బోధకుని వద్ద సంగీతం నేర్చినట్టు తెలిపారు. భువనేష్ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.

National level award for blind student in music, congratulated by District Collector Mrs. Suryakumari