On the occasion of Uttarandhra Kalpavalli Sri Paidithalli Sirimanotsavam, on behalf of the state government, Devadaya department minister and state deputy chief minister Kottu Satyanarayana presented silk clothes to Amma on Tuesday.
Publish Date : 14/10/2022
పైడిమాంబకు పట్టువస్త్రాలను సమర్పించిన
రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయయణ
విజయనగరం, అక్టోబరు 11 ః ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం సందర్భంగా, అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున, దేవాదాయ శాఖామంత్రి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మంగళవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆయనకు ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ప్రసాదాన్ని, జ్ఞాపికను అందజేశారు. మంత్రితోపాటు దేవాదాయశాఖ కమిషనర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.
పైడిమాంబ దయతో ఉత్తరాంధ్రకు రాజధాని
శ్రీ పైడితల్లి అమ్మవారి దయతో, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం పరిపాలనా రాజధానికిగా మారాలని, దేవాదాయశాఖామంత్రి కొట్టు సత్యనారాయణ ఆకాంక్షించారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అమ్మవారు రాష్ట్ర ప్రజలను, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డిని చల్లగా చూడాలని కోరారు. అధికార వికేంద్రీకరణ, సమాన అభివృద్ది కోసం ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన చేసిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీ, జిఎన్ రావ్ కమిటీ సిఫార్సులు కూడా ఇదేవిషయాన్ని చెప్పాయని అన్నారు. అమరావతికి కూడా అన్యాయం జరగదని, అక్కడా శాసన రాజధాని ఉంటుందని చెప్పారు. కానీ కొంతమంది నాయకులు దుర్భిద్దితో, తమ స్వార్థం కోసం మూడు రాజధానులను అడ్డుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టిడిపి కనుసన్నల్లో, వారితోనే అమరావతి పాదయాత్ర జరుగుతోందని, ఇదొక ఫేక్ యాత్ర అని మంత్రి ఆరోపించారు. మంత్రితోపాటు జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఇతర నాయకులు ఉన్నారు.