Close

Paidithalli Ammavari Theppotsavam is a festival of the eyes

Publish Date : 27/10/2021

కన్నుల పండువగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం
విజయనగరం, అక్టోబరు 26 :
    శ్రీ  పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం మంగళవారం కన్నుల పండువగా  జరిగింది. విద్యుత్ దీపాలతో అలంకరించిన హంస వాహన పడవపై, అమ్మవారి విగ్రహాన్ని ఆమె జన్మస్థలం పెదచెరువులో మూడుసార్లు ఊరేగించారు.
         ఈ కార్యక్రమంలో విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డాక్టర్ జిసి కిషోర్ కుమార్, అమ్మవారి ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు, ఈవో కిషోర్ కుమార్, మత్స్య శాఖ డిడి నిర్మలాకుమారి, డిఎఫ్ఓ మోహనరావు, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Paidithalli Ammavari Theppotsavam is a festival of the eyes