Photos must be uploaded in petition solution, 182 petitions for response, District Collector A. Surya Kumari

Publish Date : 29/09/2022
Photos must be uploaded in petition solution, 182 petitions for response, District Collector A. Surya Kumari

 వినతుల పరిష్కారం లో ఫోటో లను తప్పక అప్లోడ్ చేయాలి

స్పందనకు 182 వినతులు

 జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి

విజయనగరం, సెప్టెంబరు  26::  సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన  కు ప్రజల నుండి 182  వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 30, డి.ఆర్.డి.ఏ కు 07, అందగా అత్యధికంగా   రెవిన్యూ కు సంబంధించి 155  వినతులు అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, భూ సమస్యలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులను జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, జె.సి మయూర్ అశోక్,   డి.ఆర్.ఓ గణపతి రావు,   ఉప కలెక్టర్లు సుదర్శన  దొర, సూర్యనారాయణ, పద్మావతి  స్వీకరించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ అర్జీదారు లకు సమాధానం రాసేటప్పుడు సంబంధించిన ఫోటో ను కూడా అప్లోడ్ చేయాలని, సమస్య పరిష్కారానికి ముందు పరిష్కరించబడిన తర్వాత  ఫోటో లను అప్లోడ్ చేయాలని ఆదేశించారు.