Close

Pregnant women should be given food at Anganwadi centers, said District Collector Surya Kumari

Publish Date : 17/10/2022

గర్భిణీలకు అంగన్వాడీ కేంద్రాల్లోనే భోజనం పెట్టాలి

సఖీ గ్రూప్ ల సమావేశాలకు వైద్యులు కూడా హాజరు కావాలి

మామిడి రైతులు కూడా ఈ.కే.వై.సి చేయించుకోవాలి

ఆకాంక్షల జిల్లా సూచీల పై సమీక్షించిన జిల్లా కలెక్టర్ సూర్య కుమారి

విజయనగరం, అక్టోబర్ 14 : గర్భిణీల గుర్తింపు, వారి పర్యవేక్షణ శత శాతం జరగాలని జిల్లా కలెక్టర్ ఎ. అరయ కుమారి ఆదేశించారు. బయట జిల్లాల, రాష్ట్రాల నుండి వచ్చిన వారిని కూడా నమోదు చేసి వారికీ అవసరమగు అలహాలను అందించాలని సూచించారు. ఎలిజిబుల్ కపుల్స్ ను గుర్తించి వారితో ఎప్పటికప్పుడు ఏ.ఎన్.ఎం,ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ ఉండాలని అన్నారు. శుక్రవారం కలెక్టర్ తన ఛాంబర్ లో ఆకాంక్షల జిల్లా సుచీలైన వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులతో గర్భిణీల నమోదు, సామ్. మాం , బాల్య వివాహాలు, సఖి బృందాలు, వ్యవసాయం ఉద్యాన, మైక్రో ఇరిగేషన్ శాఖలు, పంచాయతి రాజ్, విద్యా శాఖల సూచీల పై సమీక్షించారు.

మూడవ సారి గర్భం ధరించిన వారిపై ప్రత్యెక దృష్టి పెట్టాలని, అందుకు గల కారణాల పై ఆరా తీసి వారికీ కౌన్సిలింగ్ చేయాలనీ అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల పై , సిజారియన్లు పై సమీక్ష చేయాలనీ సూచించారు. హై రిస్క్ గర్భినీలను ముందే గుర్తించి వారి పై ప్రత్యెక దృష్టి పెట్టాలని అన్నారు. గర్భిణీల నమోదు పై లక్ష్యాలు వారీగా సమీక్షించి తక్కువ సాధించిన వైద్యారులను, సి.డి.పి.ఓ లను అందుకు గల కారణాల పై ఆరా తీసారు. అపార్ట్ మెంట్ ల లో ఉన్న వారు సర్వే కు రానివ్వడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాలంటీర్ల ద్వారా వెళ్ళాలని, ఒక సారి పరిచయం అయితే ఇక పై సర్వే కు సహకరిస్తారని కలెక్టర్ తెలిపారు.

అంగన్వాడీ కేంద్రం పరిధి లో ప్రతి వారం లో ఒకసారైన సఖి బృందాల సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశాలకు వైద్యాధికారులు కూడా హాజరు కావాలని , బాలికల ఆరోగ్య సమస్యల పై చర్చించాలని అన్నారు. ఎర్లీ ప్రేగ్నన్సి వలన శరీరానికి కలిగే నష్టాల గురించి అవగాహన కలిగించాలని తెలిపారు. సామ్, మాం పిల్లలు ఎక్కువగా ఉన్న కేంద్రాలను ఎక్కువ సార్లు సి.డి.పి.ఓ లు సందర్శించి వారికీ ప్రత్యెక ఆహారాన్ని ఎలా అందించాలో వారి తల్లులకు అవగాహన కలిగించాలన్నారు. 6 నెలలకే అన్నప్రాసన జరగాలని, గుడ్డు, పాలు, బాలామ్రుతం పిల్లలకు అందజేయాలని తెలిపారు. ఈ విషం పై తల్లులకు అవగాహన కలిగించాలని తెలిపారు. బాల్య వివాహాల నిరోధానికి పోలీస్ ల సహకారం తీసుకోవాలని తెలిపారు.

వ్యవసాయం పై మాట్లాడుతూ మామిడి పంట వేసిన రైతులు కూడా ఈ.కే.వై.సి చేయించాలని, లేని యెడల పంటల నష్ట పరిహారం, ఇన్సురెన్సు వర్తించవని స్పష్టం చేసారు. ఈ విషయమై రైతులకు ఆర్.బి.కే ల ద్వారా అవగాహన కలిగించాలని జిల్లా వ్యవసాయాధికారి తారక రామారావు కు సూచించారు. పశువులకు వాక్సినేషన్ లక్ష్యాలను పూర్తి చేయాలనీ జే.డి డా. రమణ కు సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన పాఠశాలలో శత శాతం టాయిలెట్లు ఉండాలని , విద్యార్ధి, ఉపాధ్యాయుల నిష్పత్తి ఖచ్చితంగా ఉండేలా చూడాలని డి.ఈ.ఓ వెంకటేశ్వర రావుకు తెలిపారు. పి.ఎం.జి.ఎస్.వై క్రింద చేపడుతున్న రహదారుల పురోగతి పై సమీక్షించారు. 34 రహదారులకు గాను 15 పూర్తి అయ్యాయని, మిగిలినవి పలు దశల్లో ఉన్నాయని ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వర రావు తెలుపగా మార్చ్ నెల లోగా పూర్తి చేయాలనీ కలెక్టర్ ఆదేశించారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా నీటి వనరులు ఉన్న ప్రతి రైతు 90 శాతం సబ్సిడీ పై ప్రభుత్వం అందిస్తున్న డ్రిప్, స్ప్రింక్లర్ కొనుగోలు చేయాలనీ , అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలనీ ఏ.పి.ఎం.ఐ.పి ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కు సూచించారు. జలజీవన్ మిషన్ క్రింద మంజూరైన ప్రాజెక్ట్ లకు వెంటనే టెండర్స్ పిలవాలని గ్రామీణ నేటి సరఫరా ఎస్.ఈ ఉమా శంకర్ కు సూచించారు. నీతి అయోగ్ సూచీలన్నీ శత శాతం సాధించాలని, ఏ ఒక్క శాఖ వెనుకబడినా జిల్లా వెనుకబడిపోతుందని స్పష్టం చేసారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.రమణ కుమారి, డి.సి.హెచ్.ఎస్. డా. నాగభూషణ రావు, ఐ.సి.డి.ఎస్. పి.డి. శాంత కుమారి, సి.డి.పి.ఓ లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Pregnant women should be given food at Anganwadi centers, said District Collector Surya Kumari