RDO Keerthi met the affected fishermen families as per the instructions of the District Collector. MPs and MLAs consoled the affected families.
Publish Date : 24/10/2025
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాధిత మత్స్యకార కుటుంబాలను కలిసిన ఆర్.డి.ఓ కీర్తి
బాధిత కుటుంబాలను ఓదార్చిన ఎం.పి, ఎం.ఎల్.ఏ లు
విజయనగరం, అక్టోబరు 23: బాంగ్లాదేశ్ లో చిక్కుకున్న 8 మంది మత్స్యకారుల కుటుంబ సభ్యులను గురువారం విజయనగరం ఆర్.డి.ఓ డి.కీర్తి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో కలిశారు. జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్.డి.ఓ బాధిత కుటుంబాలతో మాట్లాడి బాంగ్లాదేశ్ నుండి రప్పించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని, ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలు అడ్రస్ లు, బాంక్ అకౌంట్ వివరాలను తీసుకొని, అన్ని విధాలా అండగా ఉంటామని వారికి చెప్పారు.
అలాగే ఎం.పి కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎం.ఎల్.ఏ లోకం నాగ మాధవి, మార్కుఫెడ్ చైర్మన్ బంగార్రాజు కూడా బాధిత కుటుంబాలను కలిసి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పై వివరించారు.