Close

Skill training to provide employment, District Collector A. Suryakumari

Publish Date : 20/06/2022

ఉపాధి క‌ల్పించేలా నైపుణ్య శిక్ష‌ణ‌

జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి

విజ‌య‌న‌గ‌రం, జూన్ 18 ః మ‌రింత‌మంది నిరుద్యోగ యువ‌త‌కు నైపుణ్య‌శిక్ష‌ణ ఇచ్చి, వారికి ఉపాధి క‌ల్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఉపాధి క‌ల్పించే కోర్సుల్లోనే వారికి శిక్ష‌ణ ఇవ్వాల‌ని సూచించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నైపుణ్యాభివృద్ది సంస్థ ఆద్వ‌ర్యంలో, నాంది ఫౌండేష‌న్ స‌హ‌కారంతో, 120 మంది నిరుద్యోగ మ‌హిళ‌ల‌కు వారం రోజుల‌పాటు స్థానిక ఎస్ఎస్ఎస్ఎస్ డిగ్రీ క‌ళాశాల‌లో, సాఫ్ట్ స్కిల్స్‌, ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ మీద శిక్ష‌ణా త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హించారు. ఈ శిక్ష‌ణ ముగియ‌డంతో, శిక్ష‌ణ పొందిన‌వారికి క‌లెక్ట‌ర్ త‌న క్యాంపు కార్యాల‌యంలో శ‌నివారం స‌ర్టిఫికేట్ల‌ను అంద‌జేశారు. జిల్లాలో మరింత ఎక్కువ‌మందిని గుర్తించి, వారికి త‌క్ష‌ణ‌మే ఉపాధి క‌ల్పించే కోర్సుల్లో శిక్ష‌ణ ఇవ్వాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి పిబి సాయి శ్రీ‌నివాస్‌, నాంది పౌండేష‌న్ శిక్ష‌కులు ర‌జ‌ని, సౌమ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

Skill training to provide employment, District Collector A. Suryakumari