Close

The focus should be on resolving revenue-related grievances, CCLA said. Video Conference with Special Principal Secretary, Saiprasad, District Collectors, JCs

Publish Date : 22/04/2022

రెవిన్యూకు సంబంధించిన స్పంద‌న విన‌తుల ప‌రిష్కారంపై దృష్టి సారించాలి
సి.సి.ఎల్‌.ఏ. ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సాయిప్ర‌సాద్‌
జిల్లా క‌లెక్ట‌ర్‌లు, జె.సి.ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌

విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 21 :
జిల్లాల్లో ప్ర‌జ‌ల నుంచి రెవిన్యూశాఖ‌కు సంబంధించి స్పంద‌న‌లో వ‌చ్చే విన‌తుల ప‌రిష్కారంపై అధికంగా శ్ర‌ద్ధ వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌లు, జాయింట్ క‌లెక్ట‌ర్‌ల‌కు సి.సి.ఎల్‌.ఏ. ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జి.సాయిప్ర‌సాద్ సూచించారు. స్పంద‌న‌లో అందే విన‌తుల్లో 60 నుంచి 70 శాతం వ‌ర‌కు రెవిన్యూశాఖ‌కు సంబంధించిన‌వే వుంటున్నాయ‌ని, వాటిని త్వ‌ర‌త‌గ‌తిన ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నించాల‌న్నారు. జాయింట్ క‌లెక్ట‌ర్‌లు ప్ర‌తిరోజు స్పంద‌న విన‌తుల ప‌రిష్కారంపై త‌హ‌శీల్దార్ల‌తో స‌మీక్షించేందుకు కొంత స‌మ‌యం కేటాయించాల‌న్నారు.
జిల్లా క‌లెక్ట‌ర్‌లు, జె.సి.ల‌తో ఆయ‌న గురువారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స‌మ‌గ్ర భూస‌ర్వే, భూరికార్డుల స్వ‌చ్ఛీక‌ర‌ణ‌, మ్యుటేష‌న్ల‌పై సమీక్షించి ప‌లు సూచ‌న‌లు చేశారు. భూస‌మ‌గ్ర స‌ర్వే పూర్త‌యిన త‌ర్వాత ఇంకా అప‌రిష్కృతం కాని భూ స‌మ‌స్య‌లు వుంటే రెవిన్యూశాఖ చొర‌వ తీసుకొని వాటిని ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. భూవివాదాల‌కు సంబంధించిన అంశాల్లో ఆర్‌.ఓ.ఆర్‌. ప్ర‌కార‌మే న‌డ‌చుకోవాల‌ని చెప్పారు. స‌మ‌గ్ర భూస‌ర్వేకు సంబంధించి స‌ర్వే, భూరికార్డుల క‌మిష‌న‌ర్ సిద్ధార్ధ్ జైన్‌, మ్యుటేష‌న్ల గురించి ఏ.బాబు త‌దిత‌రులు సూచ‌న‌లు చేశారు.
జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, స‌ర్వే విభాగం ఏ.డి. టి.త్రివిక్ర‌మ రావు, డ్వామా పి.డి. ఉమాప‌ర‌మేశ్వ‌రి త‌దిత‌రులు వీడియో కాన్ఫ‌రెన్సులో పాల్గొన్నారు.

The focus should be on resolving revenue-related grievances, CCLA said. Video Conference with Special Principal Secretary, Saiprasad, District Collectors, JCs