The list of those disqualified for the period should be displayed in the secretariats, as directed by the Joint Collector (Revenue) Dr. Kishore Kumar.
Publish Date : 28/10/2021
పథకాలకు అనర్హుల జాబితా సచివాలయాల్లో ప్రదర్శించాలి
జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.కిషోర్ కుమార్ ఆదేశాలు
నగరంలో వార్డు సచివాలయాల తనిఖీ
కోవిడ్ వ్యాక్సినేషన్ పరిశీలన
విజయనగరం, అక్టోబరు 27; రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి ఆయా వార్డులో వాటిని పొందే అర్హతలేని వారి జాబితాలు వార్డు సచివాలయంలో ప్రదర్శించాలని జాయింట్ కలెక్టర్(రెవిన్యూ, రైతుభరోసా) డా.జి.సి.కిషోర్ కుమార్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా ప్రతి సచివాలయంలో ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ పథకాలు పొందేందుకు ఆయా వ్యక్తులకు, కుటుంబాలకు అర్హతలు తెలుపుతూ పోస్టర్లను ప్రదర్శించాలన్నారు. నగరంలోని పలు వార్డు సచివాలయాలను జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.కిషోర్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. ముందుగా దాసన్నపేట-1 సచివాలయాన్ని తనిఖీ చేసి అక్కడ ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రజల నుంచి వివిధ ప్రభుత్వ సేవల కోసం వచ్చే ఇ-సేవ వినతులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పలు రిజిష్టర్లను తనిఖీ చేసి సిబ్బంది హాజరు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలను పరిశీలించారు. గృహ లబ్దిదారుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఒన్ టైం సెటిల్ మెంట్ స్కీంపై క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై ఆరా తీశారు.
అనంతరం కొత్తపేట గొల్లవీధి వార్డు సచివాలయాన్ని జె.సి. సందర్శించారు. అక్కడ కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. సచివాలయం పరిధిలో ఎంత మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు, ఇంకా మిగిలి వున్న వారి సంఖ్య, వారికి వ్యాక్సిన్ వేసేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారనే అంశాలపై అడిగి తెలుసుకున్నారు.
కంటోన్మెంట్లోని రెవిన్యూ కాలనీలో వున్న వార్డు సచివాలయం కూడా జె.సి. తనిఖీచేసి అక్కడ అందుతున్న సేవలపై తెలుసుకున్నారు. ఓ.టి.ఎస్.పథకంపై లబ్దిదారుల్లో అవగాహన కల్పించేందుకు ఏం చర్యలు చేపట్టారని ఆరా తీశారు. రికార్డులను పరిశీలించి పథకాలకు అనర్హులైన వారి జాబితా సచివాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించిందీ లేనిదీ తనిఖీ చేశారు.
