Close

The work should be done in accordance with the rules, wherever the first information about what happened should come from the Revenue itself, the District Collector in the training program for VROs.

Publish Date : 13/04/2022

👉నిబంధనలకు లోబడే పని చేయాలి
👉ఎక్కడ ఏమి జరిగినా మొదటి సమాచారం రెవిన్యూ నుండే అందాలి
👉వి.ఆర్.ఓ ల శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్

విజయనగరం, ఏప్రిల్ 13:: గ్రామాల్లో పని చేసేటప్పుడు రెవిన్యూ అధికారులు స్వంత నిర్ణయాలు తీసుకోకుండా నిబంధనలకు లోబడి పని చేయాలని జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి తెలిపారు. మోహమాటాలకు పోతే తర్వాత ఇబ్బంది పడతారని అన్నారు. బుధవారం కాలెక్టరేట్ ఆడిటోరియంలో విజయనగగరం డివిజన్ కు సంబంధించిన వి.ఆర్.ఓ లకు ఒక్క రోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలతో మమేకమై పని చేస్తే అనేక విషయాలు అర్థం అవుతాయని, అప్పుడే రెవెన్యూ అంశాల పై క్షున్నంగా అవగాహన కలుగుతుందని, సమస్యల పరిష్కారం సులువవుతుందని అన్నారు. గ్రామాల్లో జరిగే ఎలాంటి సంఘటనలైనా ముందుగా రెవిన్యూ వారి నుండి సమాచారం అందా లన్నారు. స్పందన దరఖాస్తులను గడువు ముగిసేవరకు ఉంచవద్దని, ఏ రోజు వి ఆ రోజే డిస్పోజ్ చెయ్యాలని అన్నారు. మీ వద్దనే గడువు ముగిసేవరకు ఉంటే పై అధికారుల వద్ద డిస్పోజ్ జరిగే సరికి గడువు దాటిపోయి బియాండ్ ఎస్.ఎల్.ఏ లోకి వెళ్తున్నాయని, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలన్నారు. విధి నిర్వహణ లో సమయ పాలన పాటించాలని, క్వాలిటీ పని కనపడాలని అన్నారు. రెవిన్యూ లో ఒక దరఖాస్తు తిరష్కరించ బడినా, ఆమోదించబడిన సహేతుక మైన కారణాలు ఉండాలని, ఆ కారణాలను శాఖలో ఎక్కడైనా ఆమోదించేలా ఉండాలన్నారు. ఇక పై స్పందన పెండింగ్ ఉన్న, యూనిఫామ్ ధరించకపోయినా సచివాలయ సిబ్బంది పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఆర్.డి.ఓ భవాని శంకర్ మాట్లాడుతూ గ్రామంలో రెవిన్యూ అధికారులు చేయవలసిన విధులు, బాధ్యతల పై వివరించారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా చూడడం, రికార్డుల నిర్వహణ, శాంతి భద్రతలు, సంక్షేమం, ఓటర్ల జాబితా సవరణ, రీ సర్వే, విద్యుత్ చౌర్యం తదితర అంశాలన్నీ రెవిన్యూ పరిధిలోకే వస్తాయని స్పష్టం చేశారు. ముఖ్యoగా రెవెన్యూ రికవరీ చట్టం గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నారు.
కె.ఆర్.సి ఉప కలెక్టర్ సూర్యనారాయణ సిటిజన్ సర్వీస్ పోర్టల్ గురించి, రెవిన్యూ రికార్డుల నిర్వహణ, జాబ్ చార్ట్ తదితర అంశాల పై అవగాహన కలిగించారు.
సర్వే శాఖ సహాయ సంచాలకులు త్రివిక్రమ రావు, రీ సర్వే లోని అంశాల పై అవగాహన కలిగించారు. వి.ఆర్.ఓ లు, సర్వేయర్లు సమన్వయం గా రీ సర్వే చేయవలసిన అవసరం ఉందన్నారు.
ఈ వర్క్ షాప్ లో డి.ఆర్.ఓ గణపతి రావు, డివిజన్ లోని వి.ఆర్.ఓ లు పాల్గొన్నారు.

The work should be done in accordance with the rules, wherever the first information about what happened should come from the Revenue itself, the District Collector in the training program for VROs.