Trainee Assistant Collector B. Sahadith Venkata Trivinag assigned to the district for training joined duty in the Collector’s office on Thursday.
Publish Date : 27/05/2023
ట్రైనీ సహాయ కలెక్టర్‌గా సహాదిత్ వెంకట త్రివినాగ్
విజయనగరం, మే 24 :జిల్లాకు శిక్షణ నిమిత్తం కేటాయించిన ట్రైనీ సహాయ కలెక్టర్ బి. సహాదిత్ వెంకట త్రివినాగ్ గురువారం కలెక్టర్ కార్యాలయంలో విధుల్లో చేరారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి ఎస్ ను కలెక్టర్ ఛాంబరులో కలసిన అనంతరం కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. 2022 సివిల్ సర్వీసెస్ బ్యాచ్‌కు చెందిన అధికారి 23 సంవత్సరాల వెంకట త్రివినాగ్ హైదరాబాద్ ఐఐటిలో మెటలర్జీ బ్రాంచిలో 2020లో బిటెక్ పూర్తి చేశారు. విజయవాడ, విశాఖపట్నం, ముంబై తదితర నగరాల్లో పాఠశాల విద్యను పూర్తిచేసి సి.బి.ఎస్.ఇ. అఖిల భారత పరీక్షల్లో ఆలిండియా టాపర్‌గా నిలిచారు. వెంకట త్రివినాగ్ తండ్రి బి.జయకుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆదాయపన్ను శాఖ చీఫ్ కమిషనర్‌గా చేస్తున్నారు. జయకుమార్ స్వస్థలం విశాఖ.
బాడ్మింటన్, వ్యాయామం అంటే తనకు ఎంతో ఇష్టమని వెంకట త్రివినాగ్ చెప్పారు. శ్రీకాకుళంలో నిర్వహించిన చదరంగం టోర్నమెంట్‌లో గతంలో పాల్గొన్నట్టు వివరించారు. తన తండ్రి నుంచి స్ఫూర్తి పొంది పబ్లిక్ సర్వీస్ రంగంలో పనిచేయాలని భావించానని అందువల్లే సివిల్ సర్వీసెస్‌ను తన కేరీర్‌గా ఎన్నుకున్నట్టు చెప్పారు.