Close

We will reach the specified targets during the week * Special focus on construction of sanitary complexes * Special plan for utilization of convergence funds * District Collector A. Suryakumari in a video conference

Publish Date : 25/03/2022

వారంలోగా నిర్దేశిత ల‌క్ష్యాల‌ను చేరుకుంటాం

*శానిట‌రీ కాంప్లెక్సుల నిర్మాణాల‌పై ప్ర‌త్యేక దృష్టి

*క‌న్వ‌ర్జెన్సీ నిధుల వినియోగానికి ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌

*వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి

విజ‌య‌న‌గ‌రం, మార్చి 24 ః వారం రోజుల్లోగా నిర్దేశిత ల‌క్ష్యాల‌ను చేరుకొని ఆశాజ‌న‌క ఫ‌లితాలు సాధిస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి పేర్కొన్నారు. చెత్త సేక‌ర‌ణ కేంద్రాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చి పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, జ‌గ‌న‌న్న స్వ‌చ్ఛ సంక‌ల్పం ల‌క్ష్యాల‌ను చేరుకుంటామ‌ని బ‌దులిచ్చారు. వైఎస్సార్ జ‌ల‌క‌ళ‌, జ‌ల‌జీవ‌న్ మిష‌న్ ప‌థ‌కాల‌ను స‌క్ర‌మంగా అమ‌లు చేస్తామ‌ని, క‌న్వ‌ర్జెన్సీ నిధుల‌ను స‌మృద్ధిగా వినియోగిస్తామ‌ని క‌లెక్ట‌ర్ వివ‌రించారు.

పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్ర‌న్సిప‌ల్ సెక్ర‌ట‌రీ గోపాల కృష్ణ ద్వివేదీ, డిప్యూటీ క‌మిష‌న‌ర్ కోన శ‌శిధ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో గురువారం వివిధ అంశాలపై వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. రాష్ట్ర ప్రభుత్వం చేప‌ట్టిన‌ జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇంటింటి చెత్త సేక‌ర‌ణ‌, చెత్త సేక‌ర‌ణ కేంద్రాల నిర్వ‌హ‌ణ త‌దిత‌ర అంశాల‌పై ఆశాజ‌న‌క ఫ‌లితాలు రావాల‌ని, ఆ దిశ‌గా కలెక్ట‌ర్లు, సంబంధిత విభాగాల అధికారులు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఇంటి ప‌న్నుల వసూళ్ల‌లో వేగం పెంచాల‌ని, నిర్దేశించిన ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు అంద‌రూ బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్పారు. చాలా జిల్లాల్లో షెడ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయ‌ని, పనులను వేగవంతం చేయాలన్నారు. విద్యుత్ కనెక్షన్లు, అప్రోచ్ రోడ్లు, నీటి సౌకర్యం తదితర మౌలిక వసతులను క‌ల్పించాల‌ని సూచించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ‌ పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల‌లో మరుగుదొడ్లు నిర్మాణాల‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని త్వ‌రిత‌గ‌తిన ప‌నులు పూర్త‌య్యేలా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలని కలెక్ట‌ర్ల‌ను ఆదేశించారు.

ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి మాట్లాడుతూ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్టిన చ‌ర్య‌ల గురించి వివ‌రించారు. ఉపాధి హామీ ప‌థ‌కంలో భాగంగా సాధ్య‌మైనంత ఎక్కువ మందికి ప‌నులు క‌ల్పిస్తామ‌ని పేర్కొన్నారు. మెటీరియ‌ల్ కాంపోనెంట్ నిధుల‌ను వినియోగించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు. శానిటరీ కాంప్లెక్సుల నిర్మాణానికి సంబంధించి ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేశామ‌ని, ప‌నులు ప్రారంభిస్తామ‌ని పేర్కొన్నారు. ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్లి ఈ వారంలోగా సాధ్య‌మైనంత ఎక్కువ మొత్తంలో క‌న్వ‌ర్జెన్సీ నిధుల‌ను వినియోగిస్తామ‌ని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని ప‌నులు చేప‌ట్టేందుకు అట‌వీ శాఖ అనుమ‌తులు రాలేద‌ని క‌లెక్ట‌ర్ ప్ర‌స్తావించ‌గా స‌మ‌స్య‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రిస్తామ‌ని ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ గోపాల కృష్ణ ద్వివేదీ పేర్కొన్నారు.

అలాగే వీడియో కాన్ఫ‌రెన్స్ అనంత‌రం క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి డిప్యూటీ సీఈవో రామ‌చంద్ర‌రావు, డ్వామా పీడీ ఉమాప‌ర‌మేశ్వ‌రి, డీపీవో సుభాసిణి, పంచాయ‌తీ రాజ్ ఎస్ ఈ గుప్తా, ఆర్‌.డ‌బ్ల్యూ.ఎస్‌. ఎస్ఈ శివానంద‌రావు, డ్వామా ఏపీడీ ల‌క్ష్మ‌ణరావుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మయ్యారు. వీసీలో చ‌ర్చించిన అంశాల‌పై శ్ర‌ద్ధ వ‌హించాల‌ని, నిర్ధేశించిన‌ ల‌క్ష్యాల‌ను చేరుకొనేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని సూచించారు. క‌న్వ‌ర్జెన్సీ నిధుల వినియోగంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని డ్వామా పీడీ ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా నుంచి డిప్యూటీ సీఈవో రామ‌చంద్ర‌రావు, డ్వామా పీడీ ఉమాప‌ర‌మేశ్వ‌రి, డీపీవో సుభాసిణి, పంచాయ‌తీ రాజ్ ఎస్ ఈ గుప్తా, ఆర్‌.డ‌బ్ల్యూ.ఎస్‌. ఎస్ఈ శివానంద‌రావు, డ్వామా ఏపీడీ ల‌క్ష్మ‌ణరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

We will reach the specified targets during the week * Special focus on construction of sanitary complexes * Special plan for utilization of convergence funds * District Collector A. Suryakumari in a video conference