Joint Collector inspected the fertilizer shop
Publish Date : 08/10/2021
అక్రమాలకు పాల్పడితే జైలుకు పంపిస్తాం
జాయింట్ కలెక్టర్ డాక్టర్ కిశోర్ కుమార్
ఎరువుల షాపును తనిఖీ చేసిన జెసి
దత్తిరాజేరు (విజయనగరం), సెప్టెంబరు 01 ః దత్తిరాజేరు మండలం పెదమానాపురం వద్దనున్న కోళ్ల నరసింహస్వామి అండ్ సన్స్ ఎరువుల దుఖానాన్ని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ), రైతు భరోసా) డాక్టర్ జిసి కిశోర్ కుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపులోని రికార్డులను, గోదాములను పరిశీలించారు. రికార్డుల్లో ఉన్న ఎరువుల నిల్వకు, గొడౌన్‌లో ఉన్న స్టాకుతో సరిపోల్చి చూశారు. ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఎరువులను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జెసి స్పష్టం చేశారు.
……………………………………………………………………………………………………………………
జారీ ః సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, విజయనగరం.