Close

Work diligently, resolve requests by deadline, response Tracking of applications in the new system, the officers themselves need to log in, District Collector A. Surya Kumari

Publish Date : 18/02/2022

. శ్రద్ధగా పని చేయండి

. గడువు లోగా వినతులను పరిష్కరించండి

. స్పందన కొత్త విధానం లో  లో అర్జీ  ట్రాకింగ్

. అధికారులే స్వయంగా లాగిన్ కావాలి

        జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి

విజ‌య‌న‌గ‌రం, ఫిబ్ర‌వ‌రి 15 ః గ్రామ స్థాయి నుండి, జిల్లా స్థాయి వరకు ఉద్యోగులు శ్రద్ధగా పని చేయాలనీ,  ప్రజా వినతుల పరిష్కారం లో చిత్త శుద్ధి చూపాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. ఎంతో మంది ఉన్నత విద్యావంతులకు రాని  అవకాశం మనకు వచ్చినందుకు అదృష్టంగా భావించాలని, ఈ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకొని సేవకు అంకితం కావాలని హితవు పలికారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా,  మండల  స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశం లో స్పందన వినతుల పరిష్కారం, సచివాలయాల తనిఖీ, సంక్షేమ పధకాల అమలు  తదితర అంశాల పై కలెక్టర్  సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  స్పందన ఆర్జీలను నిర్దేశిత గడువు లోగా పరిష్కరించాలని ఆదేశించారు.  స్పందన కొత్త విధానం లో అర్జీదారు పెట్టిన దరఖాస్తు ఎవరి వద్ద పెండింగ్ ఉందో తెలుసుకునేలా ట్రాకింగ్ విధానం వస్తుందని, ఎక్కడ పెండింగ్  ఉన్నా  సి.ఎం కార్యాలయం నుండే ఫోన్ వస్తుందని, ప్రతి ఒక్కరు అందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.  పరిష్కారం చెయ్యలేనివి ఉంటే వాటికోసం పరిష్కారాన్ని చూపుతామని అన్నారు. జవాబు చెప్పేటప్పుడు నిబంధనలను పూర్తిగా వివరించాలని, తప్పించుకునేలా  ప్రవర్తించవద్దని హితవు పలికారు. దానివలన అర్జీ దారు అందరి చుట్టూ తిరుగుతారని, అటువంటి  పరిస్థితి రాకుండా మొదటి అధికారే ఖచ్చితంగా  వ్యవహరించాలన్నారు.  క్రింద స్థాయి సిబ్బంది చేస్తే క్వాలిటీ రెడ్రేసల్ రాదనీ,  ఇప్పటి నుండి వచ్చే 15 రోజులు ప్రతి రోజు అధికారులు స్వయంగా లాగిన్ అయి స్పందన వినతుల పై దృష్టి పెట్టాలన్నారు.  కొత్త విధానం వచ్చే లోగా పూర్తిగా పరిష్కరించి పెండింగ్ లేకుండా ఉండాలన్నారు.  ప్రభుత్వ పధకాల అమలులో లక్ష్యాలను చేరుకునేలా శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు క్రింది స్థాయి అధికారులతో సమీక్షించుకోవాలని అన్నారు.  గ్రామ సచివాలయాల తనిఖీలకు అధికారులు వెళ్ళేటప్పుడు  అన్ని రికార్డులను, రిజిస్టర్లను తనిఖీ  చేసి  సంతకాలు  చేయాలనీ సూచించారు.  వాలంటీర్ల హాజరు ఖచితంగా ఉండేలా చూడాలని, పని చేయని వారిని తొలగించాలని ఆదేశించారు.

          సంయుక్త కలెక్టర్ అభివృద్ధి డా. మహేష్ కుమార్ మాట్లాడుతూ  అధికారులు ముందుగా సేవలకు, వినతులకు గల తేడా ను తెలుసుకోవాలని, ఒక పధకం కోసం  దరఖాస్తు పెడితే అది సేవ క్రిందకు వస్తుందని , అర్హత ఉండి అందాకా పోతే వినతుల క్రిందకు వస్తుందని స్పష్టం చేసారు. ఇక పై  గడువు లోగా పరిష్కారం కాకా పోతే 1902 కాల్ సెంటర్ నుండి సంబంధిత అధికారికి, అర్జీ దారుకు ఫోన్ వస్తుందని తెలిపారు. స్పందన లో వచ్చేవి, కార్యాలయానికి నేరుగా వచ్చేవి, ఆన్లైన్ ద్వారా, టెలి ఫోన్ ద్వారా వచ్చేవి కూడా అర్జీలుగానే నమోదు చేయాలనీ తెలిపారు.  అధికారులంతా  వ్యక్తిగత బాధ్యత  తీసుకోవాలని  అన్నారు.

          ఈ సమావేశం లో  జిల్లా పరిషత్ సి.ఈ.ఓ వెంకటేశ్వర రావు, సి.పి.ఓ విజయలక్ష్మి , తహసిల్దార్ లు, ఎం.పి.డి.ఓ లు పాల్గొన్నారు.

Work diligently, resolve requests by deadline, response Tracking of applications in the new system, the officers themselves need to log in, District Collector A. Surya Kumari