Bhoomi Puja for Bhogapuram Residents’ Homes, Joint Collector Dr. G.C. Kishore Kumar
Publish Date : 25/11/2021
భోగాపురం నిర్వాసితుల గృహలకు భూమి పూజ
అన్నిరకాల మౌలిక వసతులతో కాలనీలు
సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్
విజయనగరం, నవంబర్ 24 :: భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్వాసితులైన మరడపాలెం, ముడ్సర్లపేట గ్రామాలకు చెందిన వారి గృహాలకు బుధవారం భూమి పూజలు నిర్వహించారు. సంయుక్త కలెక్టర్ రెవిన్యూ డా.జి.సి.కిషోర్ కుమార్ రెవిన్యూ డివిజనల్ అధికారి బి.హెచ్.ఎస్.భవాని శంకర్ లబ్ది దారులతో కలసి పూజలు నిర్వహించారు. ఈ రెండు గ్రామాలకు చెందిన 138 కుటుంబాలకు పొలిపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీ లో గృహల నిర్మాణం చేస్తున్నారు. పూజ అనంతరం జె.సి రెవిన్యూ, ఇంజినీరింగ్, విద్యుత్, తదితర శాఖల అధికారులతో మాట్లాడుతూ నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఈ కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులను ఏర్పాటు చేయాలనీ అధికారులకు ఆదేశించారు. ప్రతి గ్రామం లో నీటి సరఫరా ఉండాలని , విద్యుత్ కనెక్షన్లు, ఇసుక , ఇటుక తదితర నిర్మాణ సామగ్రిని అందుబాటులో ఉంచాలని అన్నారు. అప్రోచ్ రోడ్లు , అంగన్వాడి కేంద్రాలు, స్కూల్స్, డిజిటల్ లైబ్రరీ లు, పోస్ట్ ఆఫీస్, వెటర్నరీ ఆసుపత్రి, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్, స్మశాన వాటికలు, పార్క్లు, డంపింగ్ యార్డ్ లు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. గృహాల నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.
