• Site Map
  • Accessibility Links
  • English
Close

No worries … there is no Omicron positive case in the district at present, Covid rules have to be complied with District Collector Surya Kumari

Publish Date : 13/12/2021

ఆందోళన వద్దు…
జిల్లాలో  ఒమైక్రాన్ పోజిటివ్  కేస్ ప్రస్తుతం  లేదు
కోవిడ్ నిబంధనలు పాటించాలి
జిల్లా కలెక్టర్ సూర్య కుమారి
విజయనగరం, డిసెంబర్ 12::::జిల్లాలో.  ఒమి క్రాన్ పాజిటివ్ ప్రస్తుతం లేదని, ఎవ్వరు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని అన్నారు.  ఎస్. కోట మండలం బొద్దాం పి.హెచ్.సి. పరిధిలోని వీర నారాయణం గ్రామానికి ఐర్లాండ్ నుంచి ఈ నెల 5న ఒక వ్యక్తి వచ్చారని,
విదేశాల నుంచి వచ్చాక విశాఖలో వుంటూ తన అత్తవారింటికి ఆ వ్యక్తి వచ్చారని అన్నారు.
ఆయన విదేశాల నుంచి వచ్చినట్లు సమాచారం అందటంతో వెంటనే వైద్య సిబ్బంది ఆయనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.
ఆర్ టి పి సి ఆర్ పరీక్ష నిర్వహించగా ఆయనకు పాజిటివ్ వచ్చిందని, వెంటనే ఆయన స్వాబ్ నమూనాలను జీనోమ్ టెస్ట్ కోసం ఈ నెల 6న హైదరాబాద్  పంపించడం జరిగిందని తెలిపారు.
 ఆయనకు పాజిటివ్ వచ్చిన వెంటనే ఆయనతో కలిసి న 40 మందికి కోవిడ్ టెస్ట్ నిర్వహించగా కోవిడ్ కు నెగటివ్ వచ్చిందని,
ప్రస్తుతం ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తి విశాఖలో వుంటున్నారని తెలిపారు.
ఆ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ కు పాజిటివ్ వచ్చిన సమాచారం అందడం తో
 విజయనగరం జిల్లా ఎస్. కోట బొద్దాం పి. హెచ్.సి. పరిధిలోని ఆయన సందర్శించిన వీర నారాయణం గ్రామంలోని ఇంటి పరిసరాల్లో వంద మందికి కోవిడ్ టెస్టులు చేస్తున్నామని  అన్నారు.
 ఒమిక్రన్ పాజిటివ్ గా వచ్చిన వ్యక్తి కి శనివారం కోవిడ్ టెస్ట్ నిర్వహించగా నెగటివ్ వచ్చిందని,
 దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు.
No worries ... there is no Omicron positive case in the district at present, Covid rules have to be complied with District Collector Surya Kumari