The percentage of female infants should not be reduced, the Collector said in a review on the Anti-Prenatal and Anti-Gender Discrimination Act
Publish Date : 10/01/2022
ఆడ శిశువుల శాతం తగ్గకుండా చూడాలి
గర్భస్థ పూర్వ, గర్భస్థ లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టం పై సమీక్షలో కలెక్టర్
విజయనగరం, జనవరి 07 : జిల్లాలో కొన్ని మండలాల్లో ఆడ శిశువుల శాతం తగ్గడం ఆందోళన కలిగించే విషయమని, దీని పై ప్రత్యెక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో పి.సి.పి.ఎన్.డి.టి చట్టం పై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న గర్భ స్రావాలను ఆడిట్ చేయాలనీ . ఎక్కడైనా అక్రమ గర్భ స్రావాలు జరుగుతున్నా ఆ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలనీ ఆదేశించారు. ఐ.సి.డి.ఎస్. సిబ్బంది తో కలసి గ్రామాల్లో గర్భిణీల ను, డెలివరీ లను ఖచ్చితంగా లెక్క వేయాలన్నారు. చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తే కఠీనంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ డా. మహేష్ కుమార్, ఫ్యామిలీ కోర్ట్ న్యాయమూర్తి మాధురి, డి.ఎం.హెచ్.ఓ డా. ఎల్. రామ్ మోహన్ , డి.ఎస్.ఫై మోహన రావు, సభ్యులు హాజరైనారు.
